Sai Pallavi: సాయి పల్లవి క్రేజ్.. తండేల్ కోసం బిగ్గెస్ట్ రెమ్యూనరేషన్!

సాయి పల్లవి నటనకు ప్రత్యేకమైన అభిమాన వర్గం ఉంది. ఎందుకంటే గ్లామర్ షో లేకుండా తన టాలెంట్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఆమె, సినిమాల ఎంపికలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలకే ఎక్కువగా అంగీకరించిన ఆమె, భారీ ప్రొడక్షన్ హౌస్‌లో నటించడం అరుదే. కానీ ఇప్పుడు, నాగచైతన్య సరసన నటిస్తున్న తండేల్ సినిమా కోసం ఆమె కెరీర్‌లోనే భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో ఆమె పారితోషికం కోసం పెద్దగా పట్టించుకోకుండా, స్క్రిప్ట్‌ను బట్టి తన రెమ్యూనరేషన్‌ను తగ్గించుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు తండేల్ లాంటి పాన్ఇండియా ప్రాజెక్ట్‌లో నటిస్తుండటంతో, మార్కెట్ రేంజ్‌కు తగ్గట్టుగానే పారితోషికాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు ఆమె ఒక సినిమాకు 2 కోట్లకు మించి తీసుకోలేదని సమాచారం. కానీ ఈ సినిమాకు మాత్రం ఏకంగా 5 కోట్ల పారితోషికం అందుకున్నట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ సినిమా లవ్ థ్రిల్లర్ నేపథ్యంతో రాబోతుండటంతో, సాయి పల్లవి పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంది. ఆమె లుక్, నటన సినిమాకు హైలైట్‌గా మారుతుందని అంచనా వేస్తున్నారు. ప్రేక్షకుల్లో ఆమెకు ఉన్న క్రేజ్, బాక్సాఫీస్‌పై ప్రభావం చూపించేలా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటివరకు మిడిల్ రేంజ్ సినిమాలకే పరిమితమైన సాయి పల్లవి, ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ప్రాజెక్ట్‌లను అంగీకరిస్తుండడం ఆమె కెరీర్‌కు ప్లస్ అవ్వనుంది. తండేల్తో ఆమె రెమ్యూనరేషన్ కూడా మరో లెవెల్‌కి వెళ్లిందని, ఇది ఆమె మార్కెట్‌ను పెంచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ సినిమా ఆమె కెరీర్‌లో మరో బిగ్ హిట్ అవుతుందా? అనేది వేచి చూడాలి!

Public EXPOSED: Chandrababu Ruling And YS Jagan Ruling || Ap Public Talk || Pawan Kalyan || TR