అందం అంటే సాయి పల్లవి. అలాంటి సాయి పల్లవి అందం గురించి మాట్లాడింది. అది కూడా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబు రోజురోజుకీ యంగ్‌గా మారిపోతుంటాడు. ఒకరకంగా చెప్పాలంటే మహేష్ బాబు నిత్య యవ్వనుడు. చివరకు గౌతమ్, మహేష్ బాబు ఇద్దరూ ఒకేలా కనిపిస్తుంటారంటేనే విషయం అర్థం చేసుకోవాలి. మహేష్ బాబు గ్లామర్, అందానికి సాధారణ జనాలే కాదు టాప్ హీరోయిన్లు కూడా ఫిదా అవుతుంటారు.
ఎంతో మంది హీరోయిన్లు మహేష్ బాబు అందం గురించి మాట్లాడుతుంటారు. అసలు స్క్రీన్‌పై మహేష్ గ్లామర్‌ను మ్యాచ్ చేసే అందం గురించి దర్శకనిర్మాతలు ఎన్నో కష్టాలు పడుతుంటారు. మామూలుగా అయితే మహేష్ బాబు పక్కన ఎంత పెద్ద అందగత్తెను పెట్టినా కూడా అందరూ మిల్కీ బాయ్ వైపే కళ్లన్నీ తిరుగుతుంటాయి. అలాంటి మహేష్ బాబు గురించి సాయి పల్లవి తాజాగా కొన్ని కామెంట్లు చేసింది. ఇప్పుడు అందరూ సాయి పల్లవిని ఆరాధిస్తుంటూ.. ఆమె మాత్రం మహేష్ బాబుని చూసి ఫిదా అయిపోయిందట.
మహేష్ బాబు గురించి సాయి పల్లవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. మహేశ్‌బాబు ఎంతో అందంగా ఉంటాడు. ఏ సమయంలోనైనా ఆయన స్కిన్ మెరిసిపోతుంటుందని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. కొన్నిసార్లు మహేశ్ ఫొటోలు చూసి… లుక్స్‌పరంగా ఒక వ్యక్తి ఇంత పర్‌ఫెక్ట్‌గా ఎలా ఉంటాడు? అనుకుని ఆశ్చర్యానికి గురయ్యేదాన్నంటూ తెలిపింది. ముఖ్యంగా చెప్పాలంటే, చాలావరకూ ఆయన ఫొటోల్ని జూమ్ చేసి చూస్తూ.. ఆయన ముఖంపై ఒక్కమచ్చ కూడా లేదని, ఎంతో బాగున్నారని అనుకుంటానంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చింది.