ఇంట్రెస్టింగ్ పాయింట్.. మొగలి రేకులు సాగర్ రచ్చ!

Sagar RK Naidu Shaadi Mubarak Trailer

మొగలిరేకులు సీరియల్ చూడని, ఆ పేరు వినని తెలుగు ప్రేక్షకులు ఉండరు.బుల్లితెరపై మొగలిరేకులు ఓ సంచలనం. అందులోని అన్ని పాత్రలూ ఓ ముద్రను వేశాయి. మరీ ముఖ్యంగా ఆర్కే నాయుడి పాత్రలో సాగర్ అదరగొట్టేశాడు. సొంత పేరు సాగర్ అయినా కూడా ఆర్కే నాయుడుగానే జనాలు గుర్తించడం మొదలుపెట్టారు. అలా బుల్లితెరపై వచ్చిన క్రేజ్‌ను వెండితెరపై వాడుకున్నాడు. హీరోగా సినిమాలు చేశాడు.

Sagar RK Naidu Shaadi Mubarak Trailer
Sagar RK Naidu Shaadi Mubarak Trailer

కానీ హీరోగా మాత్రం సక్సెస్ కాలేకపోయాడు. అయితే మళ్లీ ఇన్నాళ్లకు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. షాదీ ముబారక్ అంటూ కొత్త కాన్సెప్ట్‌తో ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండటంతో అందరి దృష్టి పడింది.అయితే తాజాగా వదిలిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. నేటి తరానికి పెళ్లి, పెళ్లి చూపులు వంటివాటిపై ఉన్న అభిప్రాయాలను చూపించే ప్రయత్నం చేశారు.

పెళ్లి ఎందుకు చేసుకోవాలని అనుకుంటున్నావ్ అని హీరో హీరోయిన్‌ను అడిగితే.. సెక్స్ కోసం అని నిర్మోహమాటంగా చెప్పడంతోనే ఈ సినిమా ఎలా ఉండబోతోందనేది అర్థమవుతోంది. అయితే హీరో ఒకే రోజు మూడు పెళ్లి చూపులు చూడటానికి ఎందుకు వచ్చాడు.. అతనికి ఎదురైన సమస్యలు ఏంటన్నది ఆసక్తి కలిపించేలా ట్రైలర్‌ను కట్ చేశారు. పద్మ శ్రీ దర్శకత్వంలో రాబోతోన్న ఈసినిమా దిల్ రాజు నిర్మించాడు.