స్వీటీ అనుష్క ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.!

Anushka-Shetty-marriage-birthday-date-height-age-husband-family-net-worth-imagephotos-details-biography-education-instagram-twitter-wiki-imdb-facebook-youtube-1-1

తెలుగు సినిమా మార్కెట్ లో హీరోస్ ని బట్టి పలు చిత్రాలు వసూళ్లు మార్కెట్ లు ఉంటాయని అందరికీ తెలిసిందే. కానీ ఒకప్పటి సమయం నుంచి కూడా అతి కొద్ది మంది హీరోయిన్స్ మాత్రమే తమ సత్తా చాటి హీరోలకి ధీటుగా మంచి స్టార్డం సహా వారి చిత్రాలకి అంటూ కూడా ఒక మార్కెట్ ని సెట్ చేసుకున్నారు. 

మరి అలా పాత్ బ్రేకింగ్ మూవీస్ చేసి సెన్సేషనల్ హీరోయిన్ గా నిలిచిన వారిలో అనుష్క శెట్టి కూడా ఒకరు. మరి ఆమె కెరీర్ లో చేసిన చిత్రాల్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా ఉండగా ఈ చిత్రాలతో పాటుగా హీరోయిన్ గా కూడా ఆమె చేస్తుంది. అయితే బాహుబలి సిరీస్ తర్వాత ఎక్కడికో వెళ్తుంది అనుకున్న అనుష్క..

ఆ నెక్స్ట్ కూడా పలు భారీ ఆఫర్స్ వదులుకొని “భాగమతి” అనే సినిమా చేసి సెన్సేషనల్ హిట్ కొట్టింది. అయితే దీని తర్వాత వచ్చిన “నిశ్శబ్దం” అట్టర్ ప్లాప్ కాగా మళ్ళీ స్వీటీ అనుష్క ఫాన్స్ కి అయితే చాలా గ్యాప్ వచ్చేసింది. దీనితో నెక్స్ట్ ఆమె చేసిన సినిమా “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” అనే సినిమా కోసం అందరిలో అంచనాలు ఏర్పడ్డాయి.

పైగా తనకి హీరో జాతి రత్నాలు హీరో నవీన్ పోలిశెట్టి నటిస్తుండడంతో ఆడియెన్స్ లో ఇదేదో కొత్తగా ఉందని మరింత ఎగ్జైట్ అయ్యారు. అయితే ఎప్పుడు నుంచో ఊరిస్తూ వస్తున్నా ఈ చిత్రాన్ని ఈ ఆగష్టు 4న మేకర్స్ లాక్ చేయగా ఇప్పుడు ఈ డేట్ నుంచి సినిమా తప్పుకున్నట్టుగా తెలుస్తుంది.

దీనితో ఇన్నాళ్ల తర్వాత చూద్దాం అనుకున్న అనుష్క సినిమా ఇప్పుడు వాయిదా పడినట్టు అయ్యింది. దీనితో ఈ చిత్రం విషయంలో ఫ్యాన్స్ కి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. అయితే ఈ సినిమా ఎందుకు వాయిదా పడింది అంటే ఈ చిత్రం లాస్ట్ మినిట్ లో ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరగకపోవడంతో సినిమా వాయిదా పడుతున్నట్టు అంటున్నారు. మరి కొత్త డేట్ ఇంకా రావాల్సి ఉంది.