ఒకప్పటి యంగ్ హీరో తరుణ్‌తో నిహారిక పెళ్లంట.. అంటూ గాసిప్ వచ్చింది. మరో యంగ్ హీరోతోనూ నిహారిక పెళ్లంటూ పుకార్లు వచ్చాయ్. కాదు కాదు సాయి ధరమ్ తేజ్‌కి కట్టబెట్టేస్తారట అంటూ ప్రచారం జరిగింది.
తరుణ్ ఖండించినా, ఇంకో యంగ్ హీరో ఖండించినా, తేజ్ కూడా గాలి వార్తలే.. అని కొట్టి పడేసినా ఈ పుకార్లయితే ఆగడం లేదు. చైతన్య నుంచి విడాకులు తీసుకున్న నిహారిక ఇప్పట్లో పెళ్లి చేసుకునే వుద్దేశ్యంలో లేదట.
మళ్లీ సినిమాల్లో నటించాలని అనుకుంటోందట నిహారిక. అయితే, వరుణ్ తేజ్ కన్నా ముందే నిహారిక పెళ్లయిపోతే బావుంటుందని నాగబాబు అనుకుంటున్నారట. కానీ, సాధ్యమయ్యే పనేనా అది.!
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠికి ఇటీవలే ఎంగేజ్‌మెంట్ అయిన సంగతి తెలిసిందే. త్వరలో పెళ్లి ముహూర్తాలు పెట్టేందుకు ఇరు కుటుంబ సభ్యులూ సిద్దపడుతున్నారు. చూడాలి మరి, జరుగుతున్న ప్రచారం నిజమైతే, వరుణ్ పెళ్లి కన్నా ముందే నిహారిక పెళ్లి కూడా ఫిక్స్ అయిపోనుందేమో.!