Comedian Ali : ఆ హీరోయిన్ తో పెళ్లయిందని ఆలీ పై పుకార్లు…ఆ విషయమే తెలియదన్న హీరోయిన్…..!

Comedian Ali : ఆలీ కమెడియన్ గా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అక్కర్లేని పేరు ఇక హాలీవుడ్ సినిమాలతో పాటు ఈ మధ్య బుల్లితెరపై కూడా సక్సెస్ అయ్యారు. ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా షో లో ఎంతోమంది అలనాటి సెలబ్రెటీలను పిలిచి వారితో పాత జ్ఞాపకాలను పంచుకుంటూ ఉంటారు. ప్రతివారం లాగే గతవారం అలనాటి హీరోయిన్ శుభ శ్రీ ఆలీతో సరదాగా ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చారు. ఇక శుభశ్రీ పెదరాయుడు, పుణ్యభూమి నాదేశం వంటి పదుల సంఖ్యలో సినిమాల్లో నటించి చిన్నవయసులోనే ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయారు.

అలీ శుభశ్రీ ఎన్నో సినిమాల్లో జంటగా నటించారు. ఇక దీని వల్ల వీళ్లిద్దరు త్వరలో పెళ్లి చేసుకోపోతున్నారని పుకార్లు వచ్చాయి. ఈ విషయాన్ని ఆలీ షో ద్వారా బయట పెట్టారు.సినిమా షూటింగ్‌లో అలీ శుభశ్రీ మధ్య పెళ్లి సీన్ ఉంది. దీంతో వీరిద్దరు పెళ్లి గెటప్‌లో ఉండగా, ఎవరో దాన్ని ఫోటో తీసి బయటకు లీక్ చేశారు. ఆ తర్వాత రోజు మ్యాగ్‌జైన్‌లో శుభశ్రీ, అలీ పెళ్లైయిపోయిందంటూ వార్తను ప్రచురించారట .అయితే అదే సమయంలో అలీ భార్య పుట్టింటికి వెళ్లేందుకు రైలెక్కింది. అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అలీ మామగారు సదరు మ్యాగ్ జైన్ కొన్నారు. ట్రైన్‌లో కూర్చొని చదువుతున్నారు. అందులో అలీ గురించి రాసిన వార్తను చూసి షాక్ తిన్నారు. రైలులో ఆ విషయం చెప్పకుండా .. ట్రైన్ దిగగానే అలీ భార్యకు నీ భర్తకు మరో పెళ్లి జరిగిందని చెప్పారు.

ఈ విషయం తెలిసిన అలీ భార్య అదే రోజు సాయంత్రం రైలెక్కి తిరిగి అత్తారింటికి వెళ్లింది. దీంతో పుట్టింటికి వెళ్లిన కోడలు తిరిగి రావడం చూసిన అలీ తల్లి ఏమైందని అడిగితే అలీ,శుభశ్రీ పెళ్లి జరిగిందని బోరున ఏడ్చిందట . దీంతో అలీ వచ్చి అలాంటిదేం లేదని భార్యకు, మామగారుకు సర్ది చెప్పారట చివరికి . శుభశ్రీకు పెళ్లి కూడా అయిపోయిందని, అది సినిమాలో షూటింగ్‌కు సంబంధించిన ఫోటో అంటూ అలీ భార్యకు వివరించారు. దీంతో ఆ విషయం సద్దుమనిగిందట.ఇక అసలు ఈ విషయమే నాకు తెలియదని శుభశ్రీ చెప్పడం కొసమెరుపు.