RRR.. ఇది కూడా కాపీ?

RRR

ఈ రోజుల్లో ఒక పెద్ద సినిమా సెట్స్ పైకి వచ్చింది అంటే దేన్నైనా దాటుకుంటూ వెళ్లగలదు గాని కాపీ ఆరోపణలు దాటుకుంటూ ముందు వెళ్లలేదు అనిపిస్తోంది. ఎక్కడో ఒక చోట హాలీవుడ్ సినిమాలను చూసి స్ఫూర్తి పొందినా కూడా కాపీ అంటూ ట్రోలింగ్స్ చేయడం ఈ రోజుల్లో కామన్. ఇక RRR లాంటి పెద్ద సినిమా అందుకు అతీతం కాదు.

RRR

మరోసారి జక్కన్నపై ట్రోలర్స్ డోస్ పెంచుతున్నారు. జక్కన్న సినిమాలపై కాపీ ఆరోపణలు రావడం కొత్తేమి కాదు. సై సినిమా నుంచి కూడా ఎన్నో మీమ్స్ వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు RRRపై కూడా మొదలైంది. ఎన్టీఆర్ పుట్టినరోజున భీమ్ టీజర్ ను వదిలినప్పుడు అందులో ఒక నేషనల్ జియోగ్రఫీ ఫుటేజ్ ను కలిపెయ్యడం గురించి అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన పోస్టర్ పై కూడా మీమ్స్ వస్తున్నాయి.

సినిమా పోస్టర్ ను ఘోస్ట్ రైడర్ సినిమాలో నుంచి కాపీ కొట్టేశారని ట్రోల్ చేస్తున్నారు. రామ్ చరణ్ గుర్రంపై ఉండడం, అలాగే జూనియర్ ఎన్టీఆర్ బైక్ పై రావడం చూస్తుంటే ఘోస్ట్ రైడర్ లుక్ అని తేల్చేస్తున్నారు. దాదాపు పోస్టర్ కొంత మ్యాచ్ అవ్వడంతో వెబ్ మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి. మరి రాజమౌళి టీమ్ నెక్స్ట్ పోస్టర్ తో నైనా విమర్శకుల నోళ్లకు తాళం వేస్తుందో లేదో చూడాలి.