మెగా వారసుడు రామ్ చరణ్ మరియు నందమూరి వారసుడు జూ.ఎన్టీఆర్ కలిసి ఇండియా టాప్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం “RRR “, జక్కన్న రాజమౌళి బాహుబలి తర్వాత చేస్తున్నఈ సినిమాపై దేశ వ్యాప్తంగా అంచనాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్స్ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. “ఆర్ఆర్ఆర్” సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్న సమయంలో కరోనా కారణంగా బ్రేక్ పడింది. మార్చి నెలలో లాక్ డౌన్ కు ముందే ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. అప్పటి నుండి అదుగో ఇదుగో అంటూ ఈ సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు. జులై నెలలో ఈ సినిమాను తక్కువ మంది నటీ నటులు మరియు సాంకేతిక నిపుణులతో షూట్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఆసమయంలో కరోనా ప్రభావం వలన వీలు పడలేదు. ఆ తర్వాత రాజమౌళికి కరోనా శోకటం వల్లన మరోసారి వాయిదా పడటం జరిగింది.
ఆరు నెలల తర్వాత ఎట్టకేలకు హైదరాబాద్ శివారులో ఉన్న అల్యూమీనియం ఫ్యాక్టరీలో ఆర్ఆర్ఆర్ షూటింగ్ ను నేటి నుండి ప్రారంభించారు. మొదటి మూడు రోజులు టెస్ట్ షూట్ జరుగనుందట. ఆ తర్వాత ఎన్టీఆర్ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు. ఎన్టీఆర్ పై ప్రోమో వీడియోను చిత్రీకరించడంతో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారట. ఈ నెల చివర్లో రామ్ చరణ్ “ఆర్ఆర్ఆర్” షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరి వరకు లేదంటే వచ్చే ఏడాది ఆరంభంలో సినిమా షూటింగ్ ను ముగించే అవకాశం ఉందని అంటున్నారు. సినిమాను వచ్చే ఏడాది జులై లో లేదా దసరా కానుకగా అయినా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలున్నాయని సమాచారం, కానీ జక్కన్న ఎంతకాలం చెక్కుతాడో ఆయనకీ కూడా తెలియదు కాబట్టి రిలీజ్ డేట్ గురించి అభిమానులు ఆలోచించకూడదు.