వరల్డ్ వైడ్ ఓటిటిలో అరుదైన సెన్సేషనల్ రికార్డు నెలకొల్పిన “RRR” చిత్రం.!

మన తెలుగు సినిమా గర్వించదగ్గ మరో సినిమా ఏదన్నా ఉంది అంటే అది లేటెస్ట్ సెన్సేషన్ ట్రిపుల్ ఆర్(RRR) అనే చెప్పాలి. దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో చేసిన ఇండియన్ సినిమాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా వచ్చిన ఈ చిత్రం భారీ రికార్డులు నెలకొల్పింది. 

అయితే ఈ చిత్రం ఇక ఓటిటి లో రిలీజ్ అయ్యాక అయితే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మరో లెవెల్ లోకి వెళ్ళింది. మరి ఈ సినిమా రిలీజ్ అయ్యాక నెట్ ఫ్లిక్స్ లో కంటిన్యూ గా మూడు వారాలు లక్షలాది గంటల స్ట్రీమింగ్ తో ఈ చిత్రం ఇండియన్ సినిమా నుంచి ఏ సినిమా కూడా అందుకోని స్థాయి రెస్పాన్స్ ని ఈ సినిమా కొల్లగొట్టింది. 

అయితే ఇది ఇప్పటికే ఆగిపోలేదు ఏకంగా 10 వారాలు అయ్యినా కూడా ప్రపంచ వ్యాప్తంగా కంటిన్యూ గా ట్రెండింగ్ లో నిలిచినా సినిమాగా నిలిచిందట. నాన్ ఇంగ్లీష్ ఫిలిమ్స్ జాబితాలో RRR సినిమా ఈ ఘనత అందుకొని ఒక అరుదైన సెన్సేషనల్ రికార్డుని నెలకొల్పింది.

మొత్తానికి అయితే మన సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏ లెవెల్లో దుమ్ము లేపుతుంది. ఇంకా ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు.