RRR Collections: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఇటీవలే విడుదలై ఎంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. దర్శకధీరుడు సృష్టించిన ఈ విజువల్ వండర్ ను ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. ఊహించిన స్థాయి కంటే ఎక్కువగా ఈ సినిమాకి రెస్పాన్స్ వచ్చింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు కూడా ఈ మూవీ వారి కెరీర్లో ది బెస్ట్ మూవీ నిలిచిపోతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
ఇక బాహుబలి అనంతరం దర్శకుడు రాజమౌళి మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. బాహుబలి, బాహుబలి 2 సినిమాలు భారతీయ సినిమా కీర్తిని ఎక్కడికో తీసుకెళ్ళాయి. టాలీవుడ్ ఇండస్ట్రీని ఇండియాకి పరిచయం చేసింది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమానే. బాహుబలితో ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా రాజమౌళి రికార్డు సృష్టించాడు. ఇప్పుడు మళ్లీ ఆర్ఆర్ఆర్ సినిమాతో తన రికార్డును తానే తిరగ రాసుకుంటూ మరో గుర్తింపు సాధించాడు. రోజురోజుకు ఈ సినిమాపై ఆదరణ మరింత పెరిగిపోతోంది. కోట్లల్లో కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపుతోంది. అయితే తాజాగా ఒక్క తెలంగాణలోనే వందకోట్ల షేర్ సాధించిన మొట్ట మొదటి మూవీగా ఆర్ఆర్ఆర్ చరిత్ర సృష్టించింది. తెలుగునాట భారీ వసూళ్లను సొంతం చేసుకుని దేశంలోని ట్రేడ్ వర్గాలను సైతం సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతోంది.
తెలంగాణలో ఇప్పటివరకు బాహుబలి2 పేరిట రూ.68 కోట్లతో అప్పట్లో వసూళ్లు రాబట్టగా, ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా దాదాపు రూ. 101 కోట్లతో తండ్రి కార్డును తానే బ్రేక్ చేసుకున్నాడు రాజమౌళి. ఇక ఇటీవలికాలంలో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా దిల్ రాజుకు కొంత నష్టాన్ని మిగిల్చాయి. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీతో ఆయనకు ఊరట లభించింది. ఆ సినిమాను కొన్న దానికంటే 44% ఎక్కువ కలెక్షన్లు రావడంతో ఆయన కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈనెల 14న విడుదలయ్యే కేజీఎఫ్ 2 ఈ సినిమా కోసం ఇప్పటికే ప్రేక్షకులంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక రిలీజ్ అయ్యే వరకు ఆర్ఆర్ఆర్ పాపులారిటీ తగ్గదని, అప్పటివరకు మరిన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందేమోనని పలువురు భావిస్తున్నారు.