Roshan: వైజయంతి బ్యానర్లో నటించనున్న శ్రీకాంత్ తనయుడు..పోస్టర్ విడుదల!

Roshan: శ్రీకాంత్ నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు రోషన్. నిర్మలా కాన్వెంట్ సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. మొదటి సినిమాతోనే నటనకు మంచి మార్కులే సంపాదించాడు.తండ్రి శ్రీకాంత్ నట వారసత్వం పుణికిపుచ్చుకుని పెళ్లి సందD చిత్రంతో అలరించారు. ఈ చిత్రానికి గాను నటన పరంగా, డాన్స్ ఇంకా తన లుక్స్ కి కూడా ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు.

ఇలా రెండు సినిమాలతోనే తండ్రికి తగ్గ తనయుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు. దీంతో వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. తాజాగా రోషన్ ఒక బంపర్ ఆఫర్ ని కొట్టేశాడు.ప్రతిష్ఠాత్మకమైన ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ లోఒక చిత్రం చేయనున

ప్రస్తుతం వైజయంతి బ్యానర్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె ను నిర్మిస్తుంది. రోషన్ తన తదుపరి చిత్రాన్ని ఈ బ్యానర్లో చేయనున్నాడు.ఇక ఈ సినిమాకు నేషనల్ అవార్డు విన్నర్ ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తుండగా.. స్వప్న దత్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రోషన్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఈ విషయాన్ని ప్రకటించి తమ హీరోకు బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ సినిమాతో రోషన్ కెరీర్ ఎలా టర్న్ అవుతుందో చూడాలి మరి..!