Revanth Reddy: తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఎవరైతే సినిమా విడుదల చేసే సమయంలో తమ సినిమాకి అదనపు షోలు అలాగే సినిమా టికెట్ల రేట్లు పెంచాలని కోరుకుంటారో అలాంటివారు తెలంగాణ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారాలని డ్రగ్స్ గురించి వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన తీసుకువచ్చే విధంగా వీడియోలు చేపట్టాలి అంటూ తెలియజేశారు.
ఎంతోమంది అభిమానులు ఉన్నటువంటి సెలెబ్రిటీలు ఇలా డ్రగ్స్ గురించి ప్రజలలో అవగాహన కల్పిస్తే తెలంగాణ అని రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దవచ్చు అంటూ ఈయన తెలిపారు ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా వారి సినిమాలు విడుదల అయ్యే ముందు యాంటీ డ్రగ్స్ గురించి మాట్లాడుతూ వీడియోలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే పుష్ప 2 సినిమా విడుదలవుతున్న తరుణంలో అల్లు అర్జున్ సైతం తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అంటూ ఈయన ఒక వీడియో విడుదల చేశారు.గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.. హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు మీరు తీసుకున్న చొరవకు అభినందనలు అని పేర్కొన్నారు. మీకు తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబరు 1908కు ఫోన్ చేయండి. వాళ్లు వెంటనే బాధితులను పునరావాస కేంద్రాలకు తీసుకువెళ్లి.. సాధారణ జీవనశైలిలోకి తీసుకువస్తారు.
ఇలా డ్రగ్స్ వాడే వారి వివరాలను చాలా గోప్యంగా ఉంచబడతాయి. ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశం వారిని శిక్షించడం కాదు. వారికి సాయం చేయడం. మంచి సమాజం కోసం బాధితులకు అండగా నిలుద్దాం అంటూ అల్లు అర్జున్ ఒక వీడియో విడుదల చేశారు అయితే ఈ వీడియో పై రేవంత్ రెడ్డి స్పందించారు. డ్రగ్స్ నిర్మూలన పై అవగాహన కలిగించేలా అల్లు అర్జున్ విడుదల చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.ఆరోగ్యకరమైన రాష్ట్రం, సమాజం కోసం అందరం చేతులు కలుపుదాం అని విజ్ఞప్తి చేశారు. #SayNoToDrugs వంటి పలు హ్యాష్‌ట్యాగ్స్‌ను జోడించారు.