అకిరానందన్‌ని నటనకు దూరంగా వుంచాలని రేణు దేశాయ్ భావిస్తున్నారా.? సినీ రంగంలోకి తన కుమారుడు రావొచ్చుగానీ, అతన్ని నటుడిగా మాత్రం చూడాలని రేణు దేశాయ్ అనుకోవడంలేదా.? ఇంతకీ, అకిరానందన్ మీద రేణు దేశాయ్ పెత్తనమేంటి.?
నాన్సెన్స్.! అకిరానందన్‌కి తల్లి రేణు దేశాయ్.! నటన అనేది అకిరానందన్ బ్లడ్‌లోనే వుంది.! పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి. తండ్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సోదరులు రామ్ చరణ్, వరుణ్ తేజ్.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా పెద్దదే. అందరూ సినీ పరిశ్రమలోనే వున్నారు.
తల్లి నటి, తండ్రి నటి.. సో, నట వారసత్వం అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. కాకపోతే, మ్యూజిక్ మీద అకిరానందన్‌కి ఆసక్తి ఎక్కువ. స్క్రిప్టు రైటింగ్ కూడా ఇష్టమేనట.! ‘ఇప్పటికైతే నటుడవ్వాలనే కోరికని ఎప్పుడూ నా దగ్గర ప్రదర్శించలేదు..’ అంటూ తనయుడి గురించి రేణు దేశాయ్ చెప్పుకొస్తున్నారు.
పాత మాటే ఇది.! ఒత్తిడి పెరుగుతుంది గనుక, రేణు దేశాయ్ అలా అంటుండొచ్చు. రామ్ చరణ్ స్వయంగా అకిరానందన్‌ని వెండితెరకు పరిచయం చేస్తాడనీ, ఈ దిశగా గతంలోనే మాటలు జరిగాయనీ, అదీ చిరంజీవి సమక్షంలో జరిగిందనీ అంటారు.
కానీ, రేణు దేశాయ్ చేస్తున్న వ్యాఖ్యలు.. అకిరానందన్ విషయంలో అభిమానుల్ని కొంత ఇబ్బంది పెడుతున్నాయి. ఎంత అభిమానులైనాసరే, తల్లి కంటే ఎక్కువ కాదు కదా అకిరానందన్‌కి.!