చరణ్ – శంకర్ సినిమా.! డౌట్లు పెరుగుతున్నాయ్.!

రామ్ చరణ్ హీరోగా తమిళ దర్శకుడు శంకర్ రూపొందిస్తోన్న సినిమాకి సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్.. ఇవన్నీ త్వరలో.. అతి త్వరలో విడుదలవుతాయని నిర్మాత దిల్ రాజు వెల్లడించిన సంగతి తెలిసిందే. 2024 సంక్రాంతికి ఈ సినిమాని షెడ్యూల్ చేస్తున్నారు.

నిజానికి, సినిమా షూటింగ్ మే – జూన్ నాటికే పూర్తయిపోతుందట. ఇక అక్కడి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతాయట. శంకర్ సినిమా అంటే ఆమాత్రం హంగామా వుండాలి కదా.? సుమారు ఆరు నెలలు.. ఆ పైన కేవలం పోస్ట్ ప్రొడక్షన్ పనులకే సమయం వెచ్చించబోతున్నారంటే, చిన్న విషయం కాదు.

ఎందుకంత సమయం.? అంటే, గ్రాఫిక్స్ వంటివి చాలానే వుంటాయనీ.. వాటి కోసమే అంత సమయం తీసుకోబోతున్నారనీ సమాచారం అందుతోంది. ఇంతకీ, 2024 సంక్రాంతి ఖాయమేనా.? అంటే, శంకర్ సినిమా కదా.. అంత ఖచ్చితంగా డేట్ చెప్పేయలేం. పైగా, 2024 సంక్రాంతి అంటే పోటీ గట్టిగా వుంటుంది. పైగా, అక్కడున్నది దిల్ రాజు. ఏమో, ఏం చేస్తాడో.!