బోయపాటి రామ్ ల “స్కంద” ట్రైలర్ బ్లాస్ట్ కి డేట్ వచ్చేసింది..!

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న కొన్ని క్రేజీ కాంబినేషన్ చిత్రాల్లో అయితే టాలీవుడ్ యంగ్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా యంగ్ సెన్సేషన్ శ్రీ లీల హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను ల కాంబినేషన్ ఒకటి అని చెప్పాలి. కాగా ఈ కాంబినేషన్ లో వస్తున్నా చిత్రమే “స్కంద” కాగా..

దీనిపై గట్టి హైప్ ఇప్పుడు నెలకొంది. ఇప్పటికే వచ్చిన టీజర్ మరియు పాటలు మాస్ ఆడియెన్స్ ని అలరించగా సినిమా రిలీస్ పై కూడా కూడా మంచి హైప్ ఇప్పుడు క్రియేట్ అయ్యింది. అయితే ఫైనల్ గా ఈ హైప్ ని మరింత చేసే విధంగా సినిమా నుంచి ట్రైలర్ బ్లాస్ట్ కి ఇపుడు మేకర్స్ డేట్ ని లాక్ చేసేసారు.

కాగా ఈ సినిమా ట్రైలర్ ని ప్రీ రిలీజ్ థండర్ అంటూ అనౌన్స్ చేయగా దీనిని ఈ ఆగస్ట్ 26న రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. మరి టైం ని అయితే ఇంకా చెప్పలేదు కానీ డేట్ ని అయితే రివీల్ చేసేసారు. దీనితో అసలు సినిమాపై మరింత క్లారిటీ వస్తుంది అని చెప్పొచ్చు.

మరి దీనికి కూడా ఏమన్నా ఈవెంట్ ప్లాన్ చేసి రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇంకా ఈ చిత్రంకి థమన్ సంగీతం అందించగా వరల్డ్ వైడ్ గా ఈ సినిమా పాన్ ఇండియా భాషలు తెలుగు, తమిళ్, హిందీ, మళయాళ మరియు కన్నడ భాషల్లో ఈ సెప్టెంబర్ 15న వినాయక చవితి సందర్భంగా విడుదల కాబోతుంది.