ఛత్రపతి హిందీ రీమేక్ లో సౌత్ హీరోయిన్ ? వర్కౌట్ అయ్యేనా ?

Regina cassandra will play lead role in chatrapathi hindi remake

యూట్యూబ్ లో డబ్బింగ్ మూవీస్ తో హిందీ ప్రేక్షకులని అలరించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గ్రాండ్ గా బాలీవుడ్ లో డైరెక్ట్ డెబ్యూ మూవీ ప్లాన్ చేసుకున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి 16 ఏళ్ల క్రితం తెలుగులో తీసిన ఛత్రపతి సినిమాను ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్నారు. తెలుగు తెరకు బెల్లం బాబుని పరిచయం చేసిన వినాయ‌క్ హిందీలో కూడా ఆ బాధ్యతను తీసుకోవటం విశేషం. ఛత్రపతి కథను బాలీవుడ్ కి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నాడట వినాయక్.

Regina cassandra will play lead role in chatrapathi hindi remake

ఇటీవలనే ఈ చిత్ర ప్రారంభం రాజమౌళి చేతుల మీదగా జరగటం మరో విశేషం. బెల్లం బాబు ట్రాక్ రికార్డు ఒక సారి గమనిస్తే దాదాపుగా స్టార్ హీరోయిన్స్ తోనే మూవీస్ చేశాడు. మరి ఆ ప్రకారంగానే ఈ మూవీలో హీరోయిన్ గా బాబు పక్కన బాలీవుడ్ బడా భామనే సెట్ చేస్తారని అనుకున్నారు. అంతేకాకుండా మార్కెట్ పరంగా కూడా వర్కౌట్ అవుతుందనే లెక్కలు కూడా వేశారు. అయితే అనూహ్యంగా సౌత్ హీరోయిన్ ‘రెజీనా కాసాండ్రా’ కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తుంది.

రెజీనా హిందీలో కొన్నేళ్ల క్రితం ‘ఏక్ ల‌డ్‌కీ కో దేఖా తో ఐసా ల‌గా’ మూవీలో తళుక్కుమంది. అందులో చిన్న పాత్రనే కావటంతో రెజినా హిందీ జనాలకు గుర్తులేదు. ఎవరో తెలియని హీరోయిన్, డైరెక్టర్ తో ఈ ప్రాజెక్ట్ హిందీలో వర్కౌట్ అవుతుందా? అనే చిన్న సందేహం అభిమానుల్లో మొదలైంది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ లో పెన్ స్టూడియోస్‌ పతాకంపై జయంతిలాల్‌ నిర్మిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ సినిమా హిందీ ప్రేక్షకుల్ని అలరిస్తుందో లేదో చూడాలి.