మెగాస్టార్ నే మైమపరించిందంటే రెజీనా ఆచార్య తర్వాత మళ్ళీ ఆ హీరోయిన్స్ కి చెక్ పెట్టేస్తుందేమో ..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆయన కెరీర్లో 152వ సినిమాగా తెరకెక్కుతుంది ఆచార్య. సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మాట్నీ మూవీస్ బ్యానర్స్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాతో భారీ సక్సస్ అందుకోవాలని కొరటాల ఎంతో కృషి చేస్తున్నాడు. ఈ సినిమా సామాజిక అంశంతో పాటు సందేశం కూడా ఉండటం తో ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద అంచనాలు భారీగానే ఉన్నాయి.

Mythri Backs Koratala Siva In 'Copy' Allegations | Gulte - Latest Andhra  Pradesh, Telangana Political and Movie News, Movie Reviews, Analysis, Photos

ఇక ఇప్పటికే ఈ సినిమా 40 శాతం టాకీ పార్ట్ కంప్లీటయింది. అంతేకాదు దాదాపు 10 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ సినిమాకి మణిశర్మ సంగీతమందిస్తుండటం విశేషం. ఇక ఈ సినిమాలో 5 పాటలుండగా టాకీ పార్ట్ తో పాటు మెగాస్టార్, రెజీనా లపై ఒక స్పెషల్ సాంగ్ ని షూట్ చేసేశారు. ఈ సాంగ్ సినిమాకి చాలా హైప్ తీసుకు వస్తుందని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఈ సాంగ్ లో మెగాస్టార్ తో కలిసి డాన్స్ చేసిన రెజీనా అద్భుతంగా స్టెప్స్ వేసి మెగాస్టార్ ని విపరీతంగా మెస్మరైజ్ చేసిందట.

ఆ మధ్య క్రియోటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తీసిన నక్షత్రం సినిమాలో గ్లామర్ గా నటించడం తో పాటు హద్దులు లేకుండా అందాలు ఆరబోసింది. కాని ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ గా మిగిలింది. దాంతో ఇక రెజీనా లైఫ్ క్లోజ్ అని అందరూ అనుకున్నారు. కాని అనూహ్యంగా టాలెంటెడ్ హీరో అడవి శేష్ హీరోగా నటించిన ఎవరు అన్న థ్రిల్లర్ సినిమాతో హిట్ అందుకొని మళ్ళీ ట్రాక్ లోకి వచ్చింది. ఆ తర్వాత లక్కీగా ఆచార్య లో మెగాస్టార్ తో కలిసి సాంగ్ చేసే ఛాన్స్ అందుకుంది.

Regina said No to Chiranjeevi?

ఇక ఈ సినిమా రిలీజైయ్యాక రెజీనా కి మళ్ళీ యంగ్ హీరోల సినిమాలలో ఛాన్స్ రావడం పక్కా అని యూనిట్ సభ్యులు అభిప్రాయపడుతున్నారట. అంతేకాదు కొంతమంది హీరోయిన్స్ తో పొటీగా కూడా నిలబడే సినిమాలు చేస్తుందని చెప్పుకుంటున్నారట. చూడాలి మరి రెజీనా కి ఆచార్య ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో.