‘మంచు’వారి రచ్చ.! పంపకాల్లో తేడాలొచ్చె.!

విద్యా సంస్థల వ్యవహారాలన్నీ మంచు విష్ణు చేతిలోకి వెళ్ళాయి. ఇది చాలాకాలం క్రితమే జరిగిన ప్రచారం. మరి, మంచు మనోజ్‌కి ఏం వచ్చాయ్.? ఎక్కడ తేడా కొట్టింది.? పెళ్ళయి, మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాక, మనోజ్.. ఎక్కడా విష్ణు మీద ఆరోపణలు చేసింది లేదు. మౌనికా రెడ్డితో పెళ్ళయ్యాకనే.. వివాదం తెరపైకొచ్చింది. అంటే, అనుమానించాల్సింది ఎవర్ని.?

అబ్బే, అదేం లేదు.. అని కొందరు అనొచ్చుగాక. కానీ, మోహన్‌బాబు సన్నహితుడు చిట్టిబాబు చెబుతున్నదాన్నిబట్టి, ఆస్తుల పంపకాలకు సంబంధించిన ఇష్యూస్ నిజంగానే వున్నాయట. అవన్నీ చూసుకున్న సారధి వల్లనే గొడవలన్నది చిట్టిబాబు వెర్షన్. నేరుగా అన్నతో తలపడేంతగా మంచు మనోజ్ ఎందుకు రిస్క్ చేశాడబ్బా.? పైగా, చావనైనా చస్తానుగానీ.. అనేలా ఓ కోటేషన్ పోస్ట్ చేశాడు మనోజ్ సోషల్ మీడియాలో.

పంపకాల సందర్భంగా పెద్ద మనుషులు న్యాయం చేయకపోవడంతోనే ఇదంతా అనుకోవచ్చా.?