RC 16: సినిమా రిలీజ్ ప్లాన్ కూడా రెడీ!

రామ్ చరణ్ తేజ్ తన 16వ సినిమాను బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టు అసలు అయితే ఈపాటికి మొదలు కావాల్సింది. కానీ రామ్ చరణ్ బిజీగా ఉండడం అలాగే బుచ్చిబాబు కూడా స్క్రిప్ట్ విషయంలో కొన్ని మార్పులు చేస్తుండడం వలన షూటింగ్ మొదలు పెట్టడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది.

రామ్ చరణ్ తేజ్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న గేమ్ చెంజర్ సినిమా ఫినిష్ అవ్వడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. దానికి తోడు బుచ్చిబాబు సినిమాకు డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో కనిపించాలి. అంతేకాకుండా ఫిట్నెస్ విషయంలో కూడా మార్పులు చేయాలి కాబట్టి గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించినన అన్ని వర్క్స్ పూర్తిస్థాయిలో ఫినిష్ అయిన తర్వాతనే 16వ సినిమాకు సిద్ధం కావాల్సి ఉంటుంది.

అయితే బుచ్చిబాబు ప్లాన్ ప్రకారం ఇదే ఏడాది డిసెంబర్లో RC 16 సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. నవంబర్లో పూజా కార్యక్రమాలతో సినిమాను లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక సినిమా రిలీజ్ విషయంలో కూడా బుచ్చిబాబు ఒక ప్లాన్ అయితే రెడీ చేసుకున్నట్లు సమాచారం. కరెక్ట్ గా సినిమా ఫినిష్ చేయడానికి బుచ్చిబాబు ఏడాదిపాటు టైం తీసుకునే ఛాన్స్ ఉందట. ఇక సినిమాను ప్రేక్షకుల ముందుకు 2025 సంక్రాంతి లేదా సమ్మర్ కు అనుకున్నట్లు తెలుస్తోంది. మరి రామ్ చరణ్ తేజ్ బుచ్చిబాబు ప్లాన్ కు తగ్గట్టుగా డేట్స్ ఎలా కేటాయిస్తాడో చూడాలి.