మాస్ మహారాజా రవితేజ రమేష్ వర్మతో దర్శకత్వంలో “ఖిలాడి” చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రాన్ని సత్యనారాయణ కొనేరు మరియు పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించనున్నారు.
ఈ చిత్రం కోసం తెలుగు అమ్మాయి డింపుల్ హయతి మరియు మీనాక్షి చౌదరిని హీరోయిన్లు గా తీసుకున్నారు . ఈ కుర్ర హీరోయిన్లతో పోటీ పడడానికి హీరో రవితేజ మంచి జాగ్రత్తలే తీసుకుంటున్నాడట.
ఖిలాడి కోసం రవి తేజ చాల బరువు తగ్గారని చెబుతున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌లో సరైన షేప్ లో కనిపించడానికి గత మూడు నెలలుగా రవి తేజ కఠినంగా జిమ్ లో వర్కౌట్ తో పాటు ప్రత్యేకమైన డైట్‌ను కూడా తీసుకుంటున్నాడట.
వీర తర్వాత రవితేజ, రమేష్ వర్మ కలిసి పని చేయడం ఇది రెండోసారి. ముందు చెప్పినట్టు మహిళా ప్రధాన పాత్రల్లో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి కనిపించనున్నారు. నేపథ్య స్కోరును దేవి శ్రీ ప్రసాద్ ఇస్తారు.
ప్రస్తుతం, గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న “క్రాక్” చిత్రంతో రవి తేజ బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది విడుదలకు ఈ చిత్రం సిద్ధంగా వుంది. “క్రాక్” తరువాత రవితేజ తన కొత్త చిత్రం “ఖిలాడి” షూటింగ్ లో పాల్గొంటాడు.