ఓటిటిలో సైలెంట్ గా స్ట్రీమింగ్ కి వచ్చేసిన “రావణాసుర”.!

టాలీవుడ్ సీనియర్ అండ్ ఎనర్జిటిక్ హీరో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “రావణాసుర” కోసం తెలిసిందే. ధమాకా అలాగే వాల్తేరు వీరయ్య లాంటి చిత్రాలతో వరుస భారీ విజయాలు అందుకున్న తాను రావణాసుర తో హ్యాట్రిక్ కొడతాడని చాలా మంది ఆశించారు.

కానీ ఈ సినిమా మాత్రం డిజాస్టర్ అయ్యింది. మినిమమ్ ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ రొటీన్ రివెంజ్ క్రైమ్ థ్రిల్లర్ కావడంతో ఆడియెన్స్ ఈ సినిమాకి మొహం చాటేశారు. దీనితో ఈ సినిమా ఓటిటి లో కూడా త్వరలోనే వచ్చేస్తుంది అని బజ్ వచ్చింది. కానీ అనుకోకుండా అసలు సైలెంట్ గా ఈ సినిమా స్ట్రీమింగ్ కి వచ్చేసి షాకిచ్చింది.

ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఈ సినిమా ఇపుడు తెలుగు సహా తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. బహుశా ఈ శుక్రవారం నుంచే ఈ సినిమా అందుబాటులోకి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి సుధీర్ వర్మ దర్శకత్వం వహించగా అను ఇమ్మానుయేల్, మేఘా ఆకాష్ లు హీరోయిన్స్ గా నటించగా..

మరో హీరోయిన్ లు ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్ లు కీలక పాత్రల్లో నటించారు. అలాగే ధమాకా కి వర్క్ చేసిన భీమ్స్ ఈ సినిమాకి కూడా వర్క్ చేయగా రావణాసుర ఆకస్మిక స్ట్రీమింగ్ మాత్రం వైరల్ గా మారింది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వారు కూడా ఈ స్ట్రీమింగ్ పై ఎలాంటి అప్డేట్ ఇంకా ఇవ్వలేదు.