రవితేజ సినిమా సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన పటాస్ సినిమా ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన అనిల్ రావిపూడి ఆ తర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్, సరేలేరు నీకెవ్వరు, ఎఫ్2, ఎఫ్3 వంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఎఫ్ త్రీ సినిమా ఇటీవల విడుదలై సూపర్ హిట్ అందుకుంది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న అనిల్ రావిపూడి రవితేజ సినిమా సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చాడు.

అనిల్ రావిపూడి మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో వచ్చిన సినిమా రాజా ది గ్రేట్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం రవితేజ శరత్ మండావా దర్శకత్వం వహించిన రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా జూలై 29వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి హాజరైన అనిల్ రావిపూడి రవితేజ గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు. రవితేజ మాస్ మహారాజు మాత్రమే కాదు గొప్ప మనసున్న మారాజు అంటూ రవితేజని పొగడ్తలతో ముంచేశాడు.

ఈ క్రమంలో అనిల్ రావిపూడి రామారావు ఆన్ డ్యూటీ సినిమా గురించి మాట్లాడుతూ..శరత్ మండావా ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా కోసం సామ్ సీఎస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్, అలాగే విజువల్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయంటూ వెల్లడించాడు. ఈ క్రమంలో అనిల్ రాయపూడి రాజా ది గ్రేట్ సినిమా సీక్వెల్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. గతంలో ఈ సినిమా సీక్వెల్ గురించి చాలాసార్లు ప్రస్తావన వచ్చిన కూడా అనిల్ దావిపుడి స్పందించలేదు కానీ ఈసారి మాత్రం ఈ సినిమా సీక్వెల్ తప్పకుండా తీస్తాను అని ప్రకటించాడు. అయితే అనిల్ రావిపూడి రవితేజ ఇద్దరు వేరువేరు ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా మొదలు కావడానికి చాలా సమయం పట్టేలా ఉంది.