చిరు షాకింగ్ కామెంట్స్ తో రవితేజ ఫ్యాన్స్ గుస్సా.?

లేటెస్ట్ గా సంక్రాంతి కానుకగా రిలీజ్ గా వచ్చిన లేటెస్ట్ సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన చిత్రం “వాల్తేరు వీరయ్య” కూడా ఒకటి. మరి ఈ చిత్రంపై చిత్ర యూనిట్ నిన్ననే ఓరుగల్లు లో భారీ సక్సెస్ మీట్ ని నిర్వహించగా అందులో చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో పెద్ద చర్చగానే మారాయి.

అయితే వీటిలో ఈ చిత్రంలో మరో హీరోగా చేసిన మాస్ మహారాజ రవితేజ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అయితే చిరంజీవి మాట్లాడుతూ రవితేజ లాంటి చిన్న హీరో అని సంబోధించడం షాకింగ్ గా మారింది. అసలు రవితేజ చిన్న హీరో ఏంటి అని ఇది చిరు కి తగదు అంటూ పలు కామెంట్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి.

అయితే రవితేజ ఫ్యాన్స్ మాత్రం చిరు వ్యాఖ్యలతో గుస్సా గానే ఉన్నారట. అయితే చిరు చెప్పిన కాంటెక్స్ట్ వెరయ్యి కూడా ఉండొచ్చు అని మరికొందరు అంటున్నారు ఎందుకంటే అక్కడ చిరు మాట్లాడుతూ రవితేజ లో తనకి తన సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ కనిపించాడని అన్నారు.

తన వయసులో అనుభవంలో చూసినా ఇద్దరు చిన్న హీరోలే ఇందులో ఎలాంటి అనుమానం బహుశా తనతో పోలిస్తే వారు చిన్నవారు కాబట్టి చిన్న హీరో అని ఉండొచ్చు తప్ప మరేదీ లేకపోవచ్చు. మొత్తానికి అయితే సినిమా సక్సెస్ ఏమో కానీ దీని నుంచి  కాంట్రవర్సీ లను బయటకి తీస్తున్నారు నెటిజన్స్.