సూపర్ ఫాస్ట్ గా ఉన్న రవితేజ, హరీష్ శంకర్..అపుడే టైటిల్ కూడా 

టాలీవుడ్ దగ్గర ఉన్నటువంటి పలు క్రేజీ కాంబినేషన్ లలో దర్శకుడు హరీష్ శంకర్ అలాగే హీరో మాస్ మహారాజ రవితేజల కాంబినేషన్ కూడా ఒకటి. అయితే వీరి నుంచి వచ్చిన మొదటి సినిమా ప్లాప్ అయినప్పటికీ రెండో సినిమాతో తమ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ని కొట్టారు.

మరి ఈ కాంబినేషన్ నుంచి ఇప్పుడు హ్యాట్రిక్ సినిమా కూడా రాబోతుంది. జస్ట్ కొన్ని రోజులు కితమే ఈ కాంబినేషన్ పై సినిమా అనౌన్స్ చేయగా నిన్ననే ఈ చిత్రం నుంచి హీరోయిన్ ఎవరు అనేది కూడా మేకర్స్ రివీల్ చేసేసారు. అయితే ఇప్పుడు ఈ అప్డేట్ వచ్చిన 24 గంటల్లోనే మరో బిగ్ అప్డేట్ ని అయితే రివీల్ చేసేసారు.

కాగా ఈ చిత్రానికి అయితే చిత్ర యూనిట్ “మిస్టర్ బచ్చన్” అనే టైటిల్ ని ఫిక్స్ చేయగా మరోసారి రవితేజ తన అభిమాన హీరో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ పై ప్రేమని చాటుకున్నాడని చెప్పొచ్చు. మరి అమితాబ్ ని రవితేజ ఎంత చక్కగా ఇమిటేట్ చేస్తాడో అందరికీ తెలిసిందే.

ఇప్పుడు మళ్ళీ తన సెంటిమెంట్ తో రాబోతున్నాడు. మరి ఈ సినిమాకి ఎంత ప్లస్ అవుతుందో చూడాలి. అయితే ఈ సినిమా ఓ హిందీ ప్రాజెక్ట్ కి రీమేక్ అని రూమర్స్ ఉన్నాయి కానీ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ చూస్తే అలా అనిపించడంలేదు. మరి చూడాలి ఈ సినిమా నిజంగా రీమేక్ సినిమానేనా లేక స్ట్రైట్ సినిమానా అనేది.