’ఈగల్‌’ లో కొత్త రవితేజను చూస్తారు!

రవితేజ, శ్రీలీల జంటగా నటించిన ’ధమాకా’ చిత్రం విడుదలై ఏడాది పూర్తయింది. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. అలాగే తన పీపుల్‌ విూడియా ఫ్యాక్టరీ పతాకంపై రవితేజ హీరోగా ఆయన నిర్మించిన ’ఈగల్‌’ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల కానుంది.

ఈ సందర్భంగా రవితేజ ’ఈగల్‌’ సినిమా గురించి మాట్లాడుతూ ’కార్తీక్‌ను ఛాయాగ్రాహకుడిగా చూశాం. ఈ సినిమాతో దర్శకుడిగా చూస్తాం. ఇందులో కొత్త రవితేజ కనిపిస్తాడు. అలాగే హీరోయిన్‌ కావ్యా థాపర్‌ కూడా. దేవ్‌ జాంద్‌ చాలా మంచి సంగీతం ఇచ్చాడు. తను గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నా. విశ్వప్రసాద్‌గారితో ప్రయాణం కొనసాగుతుంది’ అన్నారు రవితేజ.

’ఈ ఏడాది రెండు వైవిధ్యమైన చిత్రాలు చేశాను. ఒకటి ’ధమాకా’, మరొకటి ’ఈగల్‌’. రెండిరటిలో ఒకరే హీరో అయినా ఇద్దరు భిన్నమైన నటులతో పని చేసినట్లు అనిపించింది. ’ధమాకా’ నాకు డిఫరెంట్‌ ఫిల్మ్‌. దానికి భిన్నమైన చిత్రం ’ఈగల్‌’. ఈ అవకాశం ఇచ్చిన రవితేజగారికి, నిర్మాతలు విశ్వప్రసాద్‌, వివేక్‌గార్లకు కృతజ్ఞతలు’ అని చెప్పారు దర్శకుడు కార్తిక్‌ ఘట్టమనేని.

’గత ఏడాదిని బ్లాక్‌ బస్టర్‌తో ఎండ్‌ చేశాం. కొత్త సంవత్సరాన్ని మరో బ్లాక్‌ బస్టర్‌తో మొదలుపెడతాం. ’ఈగల్‌’ మంచి ఎంటర్‌టైనర్‌. రవితేజగారి బిగ్‌ మాస్‌ అవతార్‌తో చాలా అద్భుతంగా ఉంటుంది’ అన్నారు విశ్వప్రసాద్‌.