‘ఈగల్‌’ సంక్రాంతి బరినుంచి తప్పుకున్నట్లేనా?!

మాస్‌ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ఈగల్‌’ సంక్రాంతి బరినుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. కార్తీక్‌ ఘట్టమనేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ మూవీలో అనుపమపరమేశ్వరన్‌ ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోండగా.. కావ్య థాపర్‌ మరో కీలక పాత్రలో నటిస్తోంది.

సంక్రాతి కానుకగా ఈ సినిమాను జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్‌ అప్‌డేట్‌ల కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా ‘ఈగల్‌’ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ‘ఈగల్‌’ సినిమాకు సెన్సార్‌ బోర్డ్‌ యూ/ఏ సర్టిఫికెట్‌ ఇచ్చింది. ఇక ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డ్‌ ఒక్క కట్‌ కూడా చెప్పకపోవడం విశేషం. అయితే ఈ సినిమా వాయిదా పడనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ విషయమే సోషల్‌ విూడియాలో వైరల్‌ అవుతుంది.

ఇప్పటికే సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద మహేష్‌ బాబు \గుంటూరు కారం’, వెంకటేష్‌ ‘సైంధవ్‌’ సినిమాలు థియేటర్‌లు బుక్‌ చేసుకోగా.. ఉన్న కొన్ని థియేటర్‌లను ‘హనుమాన్‌’ దక్కించుకున్నట్లు తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో ‘ఈగల్‌’ విడుదల అవ్వడం ఆ మూవీకి పెద్ద మైనస్‌ అవుతుందని.. దీనిని వాయిదా వేసుకోవడమే బెటర్‌ అని నిర్ణయించినట్లు చెబుతున్నారు.