Raviteja : మాస్ రాజా డిమాండ్ మాములుగా లేదుగా… ప్లాప్ ఇచ్చిన రెమ్యూనరేషన్ లో తగ్గడం లేదట…!

Raviteja : రవితేజ హిట్టు ప్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు తీస్తున్నాడు. ఇక ఈ మధ్యనే హీరో పాత్రలే కాకుండా పాత్ర నచ్చితే ఇతర హీరోల సినిమాల్లో కూడా నటిస్తానంటూ చెప్పి ఫిల్మ్ నగర్ లో షాక్ ఇచ్చాడు. ఇక రవితేజ చేతిలో వరుసగా సినిమాలున్నాయి. ఇవి కాకా మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు మాస్ మహా రాజ్.

ఖిలాడి సినిమా పరాజయం తన నెక్స్ట్ మూవీస్ పై లేకుండా జాగ్రత్త పడుతున్నాడు రవితేజ బడ్జెట్ పరంగా రవితేజ సినిమాల్లో ఎక్కువ బడ్జెట్ తో తీసిన ఖిలాడి ప్లాప్ అయి నిర్మాతకు నష్టాన్ని మిగిల్చింది. ఇక ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ, టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర సినిమాల్లో నటిస్తున్నాడు.ఇక రామారావు ఆన్ డ్యూటీ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమైంది ఇప్పటికే సినిమా నుండి విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చాయి.

ఇక టైగర్ నాగేశ్వరరావు పీరియడిక్ డ్రామా అవడంతో ఇక సినిమా ను పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకు నిర్మాత ప్లాన్ చేస్తున్నారట అందువల్ల రవితేజ పారితోషికం కూడా అమాంతం పెంచేసాడట. దాదాపు 16 నుంచి 17 కోట్ల దాకా ఈ సినిమాకి తీసుకుంటున్నాడట రవితేజ.ఈ సినిమా ద్వారా ఇద్దరు కొత్త భామలు తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.