అదంతా హిట్ మహిమ.. ‘క్రాక్’ మత్తులో రవితేజ చిందులు

Ravi teja dance in Gym Area

వరుస ఫ్లాపులతో ఉన్న హీరోకు సరైన హిట్ పడితే ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. వచ్చే ఆ కొత్త ఉత్సాహం, ఊపు, ఆనందం వర్ణించలేం. మార్కెట్ డౌన్ అవుతోందన్న భయం మరో వైపు, ఫ్యాన్స్‌ను నిరుత్సాహ పరుస్తున్నామన్న ఆందోళన మరో వైపు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. అలాంటి సమయంలో ఒక్క హిట్ పడితే అన్నీ మటు మాయం అవుతాయి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న రవితేజకు క్రాక్ రూపంలో అదృష్టం కలిసి వచ్చింది. మొత్తానికి ఇన్నాళ్ల నిరీక్షణకు క్రాక్ తెర దించింది.

Ravi teja dance in Gym Area
Ravi teja dance in Gym Area

సంక్రాంతి పండుగను క్రాక్ ముందుగా తీసుకొచ్చింది. థియేటర్లకు జనాలు వస్తారా? రారా? కోవిడ్ అడ్డుకట్ట వేస్తుందా? అని అందరూ భ్రమ పడ్డారు. కానీ క్రాక్ దెబ్బకు అందరి అనుమానాలు పటా పంచలు అయ్యాయి. సినిమా విడుదలై నాలుగు వారాలు అవుతున్నా కూడా క్రాక్ సందడి తగ్గడం లేదు. మొదటి వారంలోనే ప్రాఫిట్‌లోకి పడింది. యాభై కోట్ల క్లబ్‌లో చేరిన రవితేజ మొదటి సినిమాగా క్రాక్ నిలిచింది. అలా అంతటి బ్లాక్ బస్టర్ కొట్టాక ఎంతటి ఊపు మీదుండాలి.

దానికి తగ్గట్టే రవితేజ ఖిలాడి షూటింగ్‌లో ఫుల్ జాలీగా ఉన్నాడట. ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. రెట్టింపు ఉత్తేజంతో పని చేస్తున్నాడని తెలుస్తోంది. దానికి నిదర్శనంగా రవితేజ షేర్ చేసిన ఈ వీడియో నిలుస్తుంది. రవితేజ నిత్యం వర్కవుట్లతో బిజీగా ఉంటాడన్న సంగతి తెలిసిందే. నేడు మాత్రం ఇలా తన జిమ్‌లో క్యారెట్ హల్వా తింటూ చిందులు వేస్తున్నాడు. వర్కవుట్లకు ముందు ఇలా తినాలి అంటూ డ్యాన్సులు వేస్తున్న ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.