రావణాసుర.. ఇది పెద్ద టాస్కే!

నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన దసరా మూవీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. అయన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా మారే దిశలో దసరా ప్రయాణం చేస్తుంది. ప్రేక్షకుల నుంచి ఈ మూవీ అద్భుతమైన ఆదరణ లభిస్తుంది. సెలబ్రిటీలు కూడా మూవీపై ప్రశంసలు కురిపిస్తూ ఉండటం విశేషం. ఇదిలా ఉంటే ఏప్రిల్ 7న మాస్ మహారాజ్ రవితేజ రావణాసుర సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.

గత ఏడాది చివర్లో ధమాకా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రవితేజ ఈ ఏడాది ఆరంభంలో వాల్తేర్ వీరయ్య సినిమాతో సూపర్ సక్సెస్ ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత రావణాసుర మూవీ ప్రస్తుతం రిలీజ్ కి రెడీ అయ్యింది. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ టీజర్, ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆకట్టుకున్నాయి.

యాంటి షేడ్స్ ఉన్న హీరో పాత్రలో రవితేజ ఈ సినిమాలో నటిస్తున్నాడు. చట్టంలో ఉన్న లొసుగులు తెలుసుకొని వారిని అవకాశంగా మార్చుకొని నేరాలు చేసే వ్యక్తిగా రవితేజ ఈ మూవీలో నటిస్తున్నాడు. ఇలాంటి పాత్రలో మాస్ రాజా నటించడం నిజంగా విశేషం అని చెప్పాలి.

అయితే ఈ షేడ్స్ ఒరిజినల్ గా ఉంటాయా లేదంటే రివెంజ్ ఫ్లాష్ బ్యాక్ తో రావణాసుర పాత్రని సుదీర్ వర్మ ఎలివేట్ చేసాడా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ మూవీతో హ్యాట్రిక్ హిట్ పై రవితేజ కన్ను వేసాడు. ఎలా అయిన మూవీ హిట్ అవుతుందని ఇప్పటి వరకు రానటువంటి సరికొత్త పాయింట్ తో రావణాసుర వస్తూ ఉండటంతో ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందని భావిస్తున్నారు.

అయితే నాని దసరా జోరుని తట్టుకొని రావణాసుర సక్సెస్ టాక్ తో దూసుకొనివెళ్తుందా లేదా అనేది చూడాలి. రావణాసుర హిట్ అయితే మాత్రం దసరా స్పీడ్ కి కొంత వరకు బ్రేక్స్ పడినట్లే అవుతుంది. ఒక వేళ హిట్ టాక్ రాకుంటే మరల ఏప్రిల్ 14 వరకు దసరా జోరు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.