ఊహాలు గుసగుసలాడే చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రాశీ ఖన్నా. ఈ చిత్రంలో సాయి శిరీష ప్రభావతి అనే పాత్రలో రాశీ జీవించేసింది. ఇక ఇటీవల వచ్చిన ‘ప్రతిరోజూ పండగే’లో టిక్‌టాక్ స్టార్ ఏంజెల్ ఆర్నా పాత్రతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఏంజెల్ ఆర్నాగా రాశీఖన్నా పర్‌ఫార్మెన్స్ సినిమాని ఓ రేంజ్‌కు తీసుకెళ్లింది. ఇక విజయ్ దేవరకొండతో చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో రాశీ రెచ్చిపోయి నటించింది. విజయ్‌కు పోటీగా రొమాన్స్ చేసిన ఈ అమ్మడు ప్రశంసలతో పాటు విమర్శలు మూటగట్టుకుంది.
రాశీ ఖన్నా చేతిలో ప్రస్తుతం ఎలాంటి క్రేజీ ప్రాజెక్ట్‌లు లేకపోవడంతో ఈ అమ్మడు ఫొటోషూట్స్ పై ఎక్కువగా దృష్టి పెట్టింది.లంగావోణి ధరించి సంప్రదాయ తెలుగుఅమ్మాయిలా, స్టైలిష్ లుక్‌లో ఫొటో షూట్స్ చేస్తూ అభిమానులని అలరిస్తోంది. అయితే ఈ షూట్స్ వెనుక ఉద్ధేశం ఏంటంటే.. అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించాలన్నది తన కోరిక అని, ఇలాంటి పాత్ర కోసం ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చింది. దర్శకుల దృక్పథంలో మార్పు తీసుకురావాలనే ఇలాంటి ఫొటోషూట్స్ చేసిన రాశీ తన పెళ్ళిపై కూడా స్పందించింది.
లాక్‌డౌన్ సమయంలో చాలా మంది పెళ్లిపీటలెక్కారు. మరి మీరెప్పుడు చేసుకుంటారని రాశీని ప్రశ్నించగా, అందుకు ఆమె ప్రస్తుతం నేను సింగిల్‌గా ఉన్నాను. లవ్ స్టోరీలు ఎలాంటివి నా జీవితంలో లేవు. మనసుకు నచ్చిన వ్యక్త దొరికితే అతనితో డేటింగ్ చేయాలని ఉంది. నా మనసుకు నచ్చిన వ్యక్తి దొరకితే అతనిని ప్రేమించి పెళ్లి చేసుకుంటా. ఏదో ఒక రోజు శుభముహూర్తం వస్తుందని ఎదురు చూస్తున్నాను. పరిశ్రమలో రానా, నితిన్, కాజల్ అగర్వాల్‌ల పెళ్లి చూసి చాలా సంతోషించానంటూ చెప్పుకొచ్చింది రాశి.