చిన్నారి డాన్స్ కి ఫిదా అయిన రష్మిక… షి మేడ్ మై డే అంటూ పోస్ట్…!

ఛలో సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అందాల నటి రష్మిక ఆ సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. ఈ క్రమంలో తెలుగు తమిళ కన్నడ భాషలలో వరుస సినిమాలలో అవకాశాలు దక్కించుకొని స్టార్ హీరోల సరసన నటిస్తూ నేషనల్ క్రష్ గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇక సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటించిన రష్మిక ఈ సినిమా ద్వారా పాన్ ఇండియన్ హీరోయిన్ గా మారిపోయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

గతేడా విడుదలైన పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ప్రపంచవ్యాప్తంగా విడుదలై సౌత్, నార్త్ అని తేడా లేకుండా అన్నిచోట్ల బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూలు సాధించి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడానికి సుకుమార్ దర్శకత్వ ప్రతిభ , హీరో హీరోయిన్ల నటనతో పాటు ఈ సినిమాలోని పాటలు కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమ హిట్ కి ప్లస్ పాయింట్ అయింది. ఈ సినిమాలోని రారాస్వామి అనే పాట బాగా పాపులర్ అయ్యింది.

అయితే ఎంతోమంది ఈ పాటకి డాన్స్ చేసి ఆ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పటికీ ఈ పాట ట్రెండింగ్ లోనే ఉంది. ఇక తాజాగా ఈ పాటకు ఒక చిన్నారి పాఠశాలలో తన స్నేహితులతో కలిసి డాన్స్ చేసింది. అయితే ఆ చిన్నారి డాన్స్ నచ్చిన ఒక నెటిజన్ ఈ డాన్స్ వీడియోని ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. దీంతో ఈ చిన్నారి డాన్స్ వీడియో వైరల్ అయ్యి రష్మిక కంటపడింది. ఆ చిన్నారి డాన్స్ చూసి ఫిదా అయిన రష్మిక ఆ పోస్ట్ నిరీ ట్వీట్ చేస్తూ… మేడ్ మై డే.. నేను తనని కలవాలి. కానీ ఎలా ? అంటూ చిన్నారి అడ్రెస్ కోసం ఎంక్వయిరీ చేస్తోంది. ప్రస్తుతం చిన్నారి డాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.