‘యానిమల్‌’ విజయాన్ని ఎంజాయ్‌ చేయలేకపోయా!?

‘యానిమల్‌’ సినిమా నటిగా కూడా రష్మికను మరో మెట్టుపైన నిలబెట్టింది. ఆ సినిమా సాధించిన విజయం కూడా సామాన్యమైన విజయం కాదు. దాదాపుగా వెయ్యికోట్ల రూపాయలు గ్రాస్‌ వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్‌లో విజయాలను అందుకోవడం చాలామంది హీరోయిన్ల కల. మరి ఆ కల నిజమైనా.. ఆ ఆనందాన్ని ఆస్వాదించలేకపోవడంపై రష్మిక ఇటీవల సోషల్‌విూడియాలో మాట్లాడిరది.

మా ‘యానిమల్‌’ పై ప్రశంసలు కురిశాయి. డబ్బులు కూడా అంతకంటే బాగా కురిశాయి. అయితే.. ఆ విజయాన్ని ఎంజాయ్‌ చేయలేకపోయాను. కనీసం ప్రమోషన్స్‌లో కూడా ఎక్కువగా పాల్గొనలేకపోయాను. దానికి కారణం ఒప్పుకున్న ప్రాజెక్ట్‌లే.

నేను చేస్తున్న సినిమాలన్నీ ప్రతిష్టాత్మకమైనవే. ఆ సినిమాల షూటింగులకోసం రాత్రింబవళ్లూ ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి. అందుకే ‘యానిమల్‌’ టీమ్‌తోపాటు అభిమానుల్ని కూడా మిస్‌ అయ్యాను. ఆ లోటును నా రాబోయే సినిమాలు భర్తీ చేస్తాయని భావిస్తున్నాను. అభిమానుల ప్రేమ ఇచ్చేంత సంతోషం నాకు ఏదీ ఇవ్వదు’ అంటూ చెప్పుకొచ్చింది రష్మిక మందన్నా.