టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ లో కూడా రష్మిక హీటెక్కిస్తోంది ..?

ఈ ఏడాది రష్మిక మందన్న సూపర్ స్టార్ మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు.. నితిన్ తో భీష్మ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ ని అందుకుంది. అప్పటి నుంచి అసలు రష్మిక జోరు తగ్గడం లేదు. టాలీవుడ్ లో ఏ స్టార్ హీరో సినిమా మొదలవుతున్న ముందు రష్మిక మందన్న పేరునే పరిశీలిస్తున్నారు. అంతేకాదు ప్రస్తుతం రష్మిక కి రెమ్యూనరేషన్ పరంగా భారీ స్థాయిలో డిమాండ్ ఉంది. ఒక్కో సినిమాకి 2 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సమచారం.

Tollywood: No competition for Rashmika Mandanna in Pushpa

కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప అన్న పాన్ ఇండియన్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా 5 భాషల్లో రిలీజ్ చేయనుండగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. అలాగే ఆచార్య లో రాం చరణ్ నటించే పాత్ర కి జంటగా కూడా రష్మిక పేరు పరిశీలిస్తున్నట్టు సమాచారం. అలాగే అఖిల్ అక్కినేని నటించబోయే లేటెస్ట్ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటిస్తుందన్న వార్తలు వస్తున్నాయి.

Is Karthi upset with Rashmika Mandanna for revealing Sultan film title? -  Movies News

అయితే ఈ జోరు ఒక్క టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ లోను ఉందని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తమ్ముడు కార్తి నటిస్తున్న సుల్తాన్ అన్న సినిమాతో కోలీవుడ్ లో రష్మిక హీరోయిన్ గా పరిచయం అవుతోంది. కాగా తాజాగా సూర్య ఆకాశం నీ హద్దురా అన్న సినిమాతో వచ్చి భారీ హిట్ ని దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే సూర్య నెక్స్ట్ సినిమాని లైన్ లో పెట్టినట్టు సమాచారం. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇదే గనక నిజమైతే కోలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు స్టార్స్ కి జంటగా నటించి స్టార్ హీరోయిన్ గా మారడం ఖాయం అంటున్నారు.