తమ ఫస్ట్ కొలాబరేషన్ లోనే మంచి క్రేజ్ ని తెచ్చుకునే కాంబినేషన్ లు సినిమాలో చాలా తక్కువే ఉంటాయి. మరి అలా తమ ఫస్ట్ సినిమా తోనే మంచి క్రేజ్ ను అందుకున్న కాంబినేషన్ నితిన్ అలాగే హీరోయిన్ రష్మిక మరియు దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్ అని చెప్పాలి.
నితిన్ కి సరైన హిట్ లేని సమయం అలాగే రష్మిక కూడా అప్పుడప్పుడే హీరోయిన్ గా మరిన్ని ఆఫర్స్ దక్కించుకుంటున్న సమయంలో చేసిన సినిమానే “భీష్మ”. ఈ సినిమా సంచలన విజయం నమోదు చేయడంతో ఈ ముగ్గురి త్రయం పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక డే క్రేజ్ లో ఈ ముగ్గురు నుంచి అయితే రెండో సినిమా అనౌన్స్ కావడంతో అందరిలో మరింత ఆసక్తి నెలకొంది.
ఆల్రెడీ షూటింగ్ మ్యూజిక్ వర్క్స్ కూడా స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా నుంచి ఇప్పుడు షాకింగ్ వార్త ఐతే వినిపిస్తుంది. ఈ సినిమా నుంచి రష్మిక తప్పుకున్నట్టుగా సినీ వర్గాలు ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తున్నాయి. అయితే రష్మిక అకస్మాత్తుగా తప్పుకోవడం అందరికీ ఒకింత షాకింగ్ గా అనిపించగా రష్మిక ఎందుకు వెళ్లిపోయిందో ఇప్పుడు తెలుస్తుంది.
ఇప్పుడు రష్మిక ఉన్న బిజీలో అయితే ఈ సినిమాకి డేట్స్ అడ్జస్ట్ కావడం కుదరట్లేదు అట. అందుకే ఇక ఈ సినిమా నుంచి తప్పుకోవాలని ఆమె డిసైడ్ అయ్యిందట. సో ఈరకంగా ఈ చిత్రం నుంచి ఆమె తప్పుకున్నట్టు కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. మరి ఆమె ప్లేస్ లో ఎవరు వస్తారో చూడాలి.