‘యానిమల్‌’లో రష్మిక మంధాన ఫస్ట్‌ లుక్‌కు భారీ స్పందన

బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణబీర్‌ కపూర్‌, అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న చిత్రం ‘యానిమల్‌’. ఈ మూవీలో నేషనల్‌ క్రష్‌ రష్మిక మంధాన హీరోయిన్‌గా నటిస్తుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రణబీర్‌ కపూర్‌ ఫస్ట్‌ లుక్‌ తోపాటు, రీసెంట్‌ గా విడుదల చేసిన అనిల్‌ కపూర్‌ ఫస్ట్‌ లుక్‌, రష్మిక మంధాన ఫస్ట్‌ లుక్‌లకు సినీ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. ఇందులో బల్బీర్‌ సింగ్‌ గా అనిల్‌ కపూర్‌ నటిస్తుండగా. గీతాంజలిగా రష్మిక నటిస్తుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి మేకర్స్‌ మరో క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు.

‘యానిమల్‌’ నుంచి బాలీవుడ్‌ స్టార్‌ హీరో బాబీ డియోల్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ‘యానిమల్‌’ యొక్క శత్రువు అంటూ రిలీజ్‌ చేసిన ఈ పోస్టర్‌ ప్రస్తుతం సోషల్‌ విూడియాలో వైరల్‌ అవుతుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాబీ డియోల్‌ మెయిన్‌ విలన్‌ అని తెలుస్తుంది. ఇప్పటికే బాబీ డియోల్‌ లవ్‌ హాస్టల్‌ సినిమాలో విలన్‌గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇక యానిమల్‌లో బాబీ రోల్‌ ఎలా ఉంటుందని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.