రష్మిక మందాన్న ఈ మధ్య జిమ్‌లోనే ఎక్కువగా కనిపిస్తోందన్న సంగతి అందరికీ తెలిసిందే. వ్యాయామం చేయడంలో రష్మిక ఎంతో ఆనందాన్ని వెతుక్కుంటోన్నట్టు కనిపిస్తోంది. ఆ మధ్య బీచ్‌లో రష్మిక చేసిన విన్యాసాలు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. పొట్టి నిక్కర్లు వేసుకుని బీచ్‌లొ పరిగెత్తడం, వర్కవుట్లు చేయడంతో రష్మిక ఫుల్ వైరల్ అయింది. ఓ రెండు మూడు రోజులు ఈ వీడియోలతో రష్మిక రచ్చ రచ్చ చేసింది.
ఆ తరువాత జిమ్‌లొకి అడుగుపెట్టింది. అక్కడా వర్కవుట్లు చేస్తూ హల్చల్ చేసింది. మామూలుగా ఇప్పుడు ఫాంలో ఉన్న హీరోయిన్లందరూ కూడా జిమ్ బాట పట్టారు. రాశీ ఖన్నా, లావణ్య త్రిపాఠి వంటి హీరోయిన్లు జిమ్‌లోనే గడిపేస్తున్నారు. రష్మిక కూడా జిమ్‌లోనే సందడి చేస్తోంది. లాక్డౌన్ ఎఫెక్ట్ వల్ల వీరంతా ఇలా జిమ్‌లపై దాడి చేస్తోన్నట్టు కనిపిస్తోంది. తాజాగా రష్మిక ఓ వీడియోను షేర్ చేసింది.
అందులో రష్మిక పెద్ద మొత్తంలో బరువును ఎత్తుతున్నట్టు కనిపిస్తోంది. ఈ భారీ కసరత్తులు చూస్తుంటే రష్మిక పుష్ప చిత్రం కోసమే రెడీ అవుతోన్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి రష్మిక మాత్రం తెలుగులో ఫుల్ బిజీగా మారిపోయింది. ఓ వైపు పుష్ప మొదలుకాకుండానే శర్వానంద్ నటిస్తోన్న ఆడాళ్లూ మీకు జోహార్లు సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. అటు కోలీవుడ్‌లో కార్తీ సుల్లాన్‌ను ఫినిష్ చేసేసింది. రష్మిక అటు టాలీవుడ్ ఇటు కోలీవుడ్‌ను కవర్ చేసేస్తోంది.