రష్మిక మందాన్న ఇప్పుడు ఎంతటి స్టార్డంను ఎంజాయ్ చేస్తుందో అందరికీ తెలిసిందే. టాప్ టక్కర్ అనే ఓ ప్రైవేట్ ఆల్బంలో నటిస్తే అది దేశ వ్యాప్తంగా వైరల్ అయింది. రష్మిక కులుకులు, అందాలు, కొంటె చూపులు, క్యూట్ స్టెప్పులు ఇలా అన్నింటితో కుర్రకారును ఫిదా చేసేసింది. నేషనల్ క్రష్‌గా రష్మిక అందరి మనసులను కొల్లగొట్టేసింది. ప్రస్తుతం రష్మిక పాపులారిటీ ఓ రేంజ్‌లో ఉంది. సౌత్ మొత్తానికి రష్మిక తన గుప్పిట్లో పెట్టేసుకుంది.
ఇకపై బాలీవుడ్‌లో జెండా పాతేందుకు రష్మిక రెడీ అవుతోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో ఓ ప్రాజెక్ట్‌ను ఓకే చేసింది. అయితే రష్మిక ఇప్పుడు సౌత్ ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉంది. వాటి కోసమే రష్మిక కసరత్తులు చేస్తోన్నట్టుంది. నిత్యం వర్కవుట్లు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే తాజాగా జిమ్‌లో కష్టపడుతున్న రష్మికకు గాయమైనట్టుంది. కాలికి పట్టీ తొడిగి మరీ వర్కవుట్లు చేస్తోంది. వర్కవుట్లు ఎక్కువగా చేయడంతో కాళ్లు పట్టేసినట్టు తెలుస్తోంది.
అయినా కూడా రష్మిక తన వర్కవుట్లను ఆపడం లేదు. బుల్లి నిక్కర్‌లో రష్మిక చేస్తోన్న వర్కవుట్లు, షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. తెల్లవారు ఝామున ఐదు గంటల లోపే తన వర్కవుట్లను పూర్తి చేసినట్టుంది. ఇందులో రష్మిక బుల్లి నిక్కర్‌లో దర్శనమిచ్చింది. అంతే కాకుండా తన మోకాలి వద్ద పట్టి ధరించినట్టు కూడా కనిపిస్తోంది. మొత్తానికి వర్కవుట్లు అయిపోయాయంటూ రష్మిక చెప్పుకొచ్చింది. రష్మిక ప్రస్తుతం పుష్ప సినిమాతో ఫుల్ బిజీగా ఉంది. ఆ తరువాత శర్వానంద్ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యేలా ఉంది.