అందరూ చూస్తుండగానే.. బీచ్‌లో అలాంటి పనులేంటి రష్మిక!!

Rashmika mandanna Workout In Beach

ఛలో బ్యూటీ రష్మిక మందాన్న తెలుగు ప్రేక్షకులను ఏ రేంజ్‌లో కట్టి పడేసింది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్‌లో కలిసి రావడం, సినిమాలు హిట్ అవ్వడం, తెలుగు ప్రేక్షకుల అభిమానానికి ముగ్దురాలు అవ్వడం, ఇక్కడే ఫ్యూచర్‌ను ఊహించుకోవడంతో హీరో రక్షిత్ శెట్టితో జరిగిన నిశ్చితార్థాన్ని కూడా రద్దు చేసుకుంది. కన్నడ కిర్రాక్ పార్టీ సినిమాతో రక్షిత్ శెట్టి పరిచయం, ప్రేమ, నిశ్చితార్థం వరకు వెళ్లిన రష్మిక.. అన్నింటికి పుల్ స్టాప్ పెట్టేసింది. టాలీవుడ్‌లో కెరీర్‌ను నిలబెట్టుకోవాలని కష్టపడింది.

Rashmika mandanna Workout In Beach
Rashmika mandanna Workout In Beach

అనుకున్నట్టే రష్మిక టాలీవుడ్‌లో స్థిరపడిపోయింది. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుంది. వరుస హిట్లతో దూసుకుపోతున్న రష్మిక.. స్టార్ హీరోలకు మంచి ఆప్షన్‌గా తయారైంది. సరిలేరు నీకెవ్వరు, భీష్మ చిత్రాలతో ఇటీవలె సూపర్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ భామ తెరపై ఎంత సందడి చేస్తుందో సోషల్ మీడియాలో అంతకు పదింతలు చేస్తుంది.

Rashmika mandanna Workout In Beach
Rashmika mandanna Workout In Beach

రష్మికపై సోషల్ మీడియాలో ఎంత పాజిటివ్ ఉంటుందో అంత నెగెటివ్ ఉంటుంది. ఈమె షేర్ చేసే ఫోటోలు అందర్నీ తెగ నవ్విస్తాయి. బుజ్జి కుక్క పిల్లలా పెట్టే పోజులకు అందరూ ఫిదా అవుతుంటారు. తాజాగా ఈ అమ్మడు బీచ్‌లో పొట్టి డ్రెస్సులు వేసుకుని సందడి చేసింది. అందరూ చూస్తుండగానే డంబెల్స్‌ను పట్టుకుని వాకింగ్ చేస్తూ వర్కౌట్లు చేస్తోంది. ఇక ఆమె వేసుకుని పొట్టి దుస్తులు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. ఇలా అందాలను బీచ్ ఒడ్డున చూపించే సరికి అందరూ అవాక్కవుతున్నారు. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో నటిస్తోంది.