ఛలో బ్యూటీ రష్మిక మందాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వెండితెరపై ఎంత సందడి చేస్తుందో.. సోషల్ మీడియాలోనూ అంతే ఫన్నీగా ఉంటుంది. ఈ మధ్య మాత్రం రష్మిక తెగ వైరల్ అవుతోంది. బీచ్‌లో వర్కౌట్లు అంటూ వీడియోలతో దుమ్ములేపింది. తాజాగా రష్మిక మాత్రం గోవాలో తన ఫ్రెండ్స్‌తొ పార్టీ చేసుకోండి. ఈ మధ్యే తన సోషల్ మీడియా ఖాతాలో పది మిలియన్లు దాటిన సందర్భంలో స్పెషల్ పోస్ట్ చేసింది.
తాజాగా రష్మిక ఓ పోస్ట్ చేసింది. ఒక వేళ తనను ప్రేమిస్తే తన రెక్కలు కత్తిరించకండి.. స్వేచ్చను ఇవ్వండని తనలోని భావాలను చెప్పుకొచ్చింది. ఇలా ప్రతీసారి ఏదోలా కవిత్వాలు చెబుతూ.. తనలోని ప్రతిభను చూపిస్తూనే ఉంది. ఆ మధ్య మహల్ కథ అంటూ, అంతకుముందు తండ్రి కూతుళ్ల మధ్య ఉన్న బంధం గురించి ఎంతో గొప్పగా చెప్పింది. అలా రష్మికలో ఓ కవయిత్రి కూడా దాగి ఉందని బయటపడింది.
ఇక రష్మిక చిన్న పిల్లలా చేస్తుందన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య భీష్మ ప్రమోషన్స్‌లో కుక్క బిస్కెట్లు తింటుందని బయటపడింది. అలా ఆ విషయం బయటకు వచ్చాక రష్మిక చేసిన కొన్ని ఫోటోలు, ఫోటో షూట్లు తెగ వైరల్ అయ్యాయి. అలా క్యూట్ క్యూట్ చేష్టలతో రష్మిక ప్రతీసారి నెటిజన్లు ఆకట్టుకుంటోంది. తాజాగా వెరైటీగా కన్ను కొట్టి కుర్రాళ్లను ఫిదా చేసింది. రష్మిక చేసిన ఈ కొంటె పనికి నెటిజన్లు సంబరపడిపోతున్నారు. రష్మిక ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లో పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. పుష్ప చిత్రం షూటింగ్ ఇంకా మొదలవ్వలేదు. కార్తీ సుల్తాన్ షూటింగ్ ఇటీవలె పూర్తి అయింది.