rashmika mandanna : ఇది చిన్న శాంపిల్ మాత్రమే.. రష్మిక రచ్చ మామూలుగా లేదు!

rashmika mandanna Top tucker viral

నేషనల్ క్రష్‌గా రష్మిక మందాన్న జాతీయ స్థాయిలో మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. కేవలం దక్షిణాది సినిమాల్లో నటిస్తూనే ఉత్తరాదిన కూడా ఈ రేంజ్ క్రేజ్ తెచ్చుకోవడం మామూలు విషయం కాదు. అలా రష్మిక మందాన్న ఇప్పుడు పాన్ ఇండియన్ హీరోయిన్ అయిపోయింది. ఆల్రెడీ బాలీవుడ్‌లో ఆఫర్లను పట్టేసింది. అయితే బాలీవుడ్‌ తెరపై అదరగొట్టే కంటే ముందు జస్ట్ ఓ చిన్న శాంపిల్‌ను వదిలింది.

rashmika mandanna Top tucker viral
rashmika mandanna Top tucker viral

ఇంతటి స్టార్డం ఉన్న హీరోయిన్ ఓ ప్రైవేట్ ఆల్బమ్‌లో నటిస్తుందంటే అది మామూలు విషయం కాదు. అలా రష్మిక మందాన్న నటించిన మొదటి ఆల్బమ్ టాప్ టక్కర్. ఈ ఆల్బమ్ నేడు రిలీజ్ అయింది. ప్రస్తుతం ఇది నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. ఆ వీడియోలో రష్మిక డిఫరెంట్ గెటప్‌లో కనిపించి మెప్పించింది. క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, స్టెప్పులతో కుర్రకారును ఫిదా చేసేసింది.

సిద్దార్థ్ మల్హోత్రతో రష్మిక ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కంటే ముందే బాలీవుడ్‌ ప్రేక్షకుల మది దోచేయడం కోసం రష్మిక టాప్ టక్కర్ అనే హిందీ ఆల్బమ్‌తో కిక్కిచ్చింది. ప్రముఖ పాప్‌ సింగర్‌ బాద్‌షా, యువన్‌ శంకర్‌ రాజా, రష్మిక కలిసి.. ‘టాప్‌ టక్కర్‌’ ఆల్బమ్‌ కోసం ఆడిపాడారు. తాజాగా ఈ వీడియో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. పుష్పతో ఎలాగూ పాన్ ఇండియన్ స్టేటస్ రష్మిక మందాన్నకు వస్తుందన్న సంగతి తెలిసిందే.