చిన్న హీరోకి ఓకే చెప్పిన రష్మిక మండన్న.!

పెద్ద సినిమాలే అయినా, ఒప్పుకోవడానికి ‘డేట్స్’ అందుబాటులో వుండడంలేదు రష్మిక మండన్నకి.! తెలుగులో ‘పుష్ప’ సినిమా చేస్తోంది రష్మిక ప్రస్తుతం. అది కాకుండా, ఇంకో సినిమా కూడా చేస్తోందామె.

హిందీ సినిమాల్లో బిజీ అయ్యాక, రష్మిక డేట్స్ కొంత అయోమయంలో పడ్డాయి.. సౌత్ సినిమా విషయానికొచ్చేసరికి. తాజాగా, రష్మిక ఓ చిన్న హీరో సినిమాకి ఓకే చెప్పిందట. ఆ హీరో ఎవరో కాదు సిద్దు జొన్నలగడ్డ అని తెలుస్తోంది. సిద్దూ హీరోగా తెరకెక్కనున్న సినిమా కోసం పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలించినా, చివరకు రష్మికని ఓకే చేశారట.

రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్‌ని ఈ సినిమా కోసం రష్మికకి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. అయినా, సిద్దూ అంటే చిన్న హీరో ఏమీ కాదిప్పుడు. ‘డీజే టిల్లు’తో సిద్దూ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అద్గదీ అసలు సంగతి.