అసలే టీనేజ్‌.. అందులోను నేను కొంచెం రెబల్‌ –  రష్మిక

Rashmika

‘అసలే టీనేజ్‌.. అందులో నేను కొంచెం రెబల్‌గా ఉండేదాన్ని’ అంటోంది క్రేజీ బ్యూటీ రష్మిక మందన.  ఇంట్లోనే ఉండి నేనింత హ్యాపీగా, కామ్‌గా, ప్రశాంతంగా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు. మా వాళ్ళు  భవిష్యత్తులో దేన్నైనా ఎదుర్కొనే బలాన్ని నాలో నింపారు అని తన లాక్‌డౌన్ అనుభవాలను చెప్పుకొచ్చింది రష్మిక.

Rashmika

ఇటీవల  రష్మికను కలిసి మాట్లాడినప్పుడు మనసు విప్పి తన అనుభవాలను పంచుకుంది.  కరోనా వైరస్‌ కారణంగా ఉరుకుల పరుగుల జీవితానికి బ్రేక్‌ పడింది నా 18 ఏళ్ల వయసు నుంచి నా జీవితం రేస్‌లా పరిగెడుతూనే ఉంది. విరామం అనేది లేకుండా.  కానీ ఇలాంటి లాక్‌డౌన్‌ ఎప్పుడూ దొరకలేదు. ఏదైనా పనిలో గమ్యానికి చేరుకున్నాం అని అనుకునేలోగా మరో కొత్త రేస్‌ మొదలయ్యేది.ఇలా ఒకటి పూర్తవ్వగానే మరోటి. అది పూర్తవ్వగానే మరో రేస్‌లో పరిగెడుతున్నాను. బాధతో ఇలా చెప్పడంలేదు. ఎందుకంటే నా లైఫ్‌ ఇలానే ఉండాలని కోరుకున్నాను కూడా.

ఇన్ని రోజులు ఇంట్లో ఉండటం నాకిదే మొదటిసారి. స్కూల్‌ నుంచి కాలేజీ వరకూ ఇంటికి దూరంగా హాస్టల్‌లోనే ఉన్నాను. మా అమ్మానాన్నలు ఎందుకు నాతో అంత స్ట్రిక్ట్‌గా ఉంటున్నారనుకునేదాన్ని. అసలే టీనేజ్‌.. అందులో నేను కొంచెం రెబల్‌గా ఉండేదాన్ని. దాంతో అలా అనుకున్నానేమో? కానీ ఇప్పుడు వాళ్ల మీద నాకలాంటి ఫీలింగ్‌ లేదు.సినిమా షూటింగ్ ల  కోసం రాత్రంతా మా అమ్మగారు నాతోనే ఉంటున్నారు. ఫ్యామిలీతో మంచి సమయాన్ని గడపడానికి నాన్న తపన పడుతుంటారు .ఈ లాక్‌డౌన్‌ వల్ల నా కుటుంబంతో కొన్ని నెలలు గడిపే అవకాశం వచ్చింది” అన్నారు రష్మిక.