ఎంత క్యూట్‌గా ఉందో… రష్మిక మందాన్న వీడియో వైరల్

రష్మిక మందాన్న సోషల్ మీడియాను ఊపేస్తోన్న సౌత్ స్టార్స్‌లో టాప్ 5లో కచ్చితంగా ఉంటుంది. లాక్డౌన్ మూలానా హీరో హీరోయిన్లు తమ అభిమానులను కలుసుకునేందుకు వీలుపడలేదు. కనీసం సినిమాలతోనైనా పలకరిద్దామని అనుకుంటే అది కూడా వీలు పడలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ అభిమానులు అందుబాటులో ఉంటారు. వారితో నిత్యం టచ్‌లో ఉండేందుకు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయ్యారు.

Rashmika Mandanna Ready To join In Pushpa Shooting
Rashmika Mandanna Ready To join In Pushpa Shooting

రష్మిక మందాన్న అసలే తెలివి తేటలు ఎక్కువ ఉన్న అమ్మాయి. ముందు నుంచీ సోషల్ మీడియాలో తన ఫ్యాన్ బేస్‌ను పెంచుకుంటూ వస్తూనే ఉంది. ఇంకా ఎక్కువ మంది తనను ఫాలో అయ్యేలా వెరైటీ వెరైటీ పోల్స్ పెట్టి అభిమానుల పల్స్ తెలుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. రష్మిక లాక్డౌన్‌లో పెట్టిన పోల్స్ ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. ఈ మధ్య రష్మిక తన వర్కవుట్లతో సోషల్ మీడియాను ఊపేసింది.

రేపటి నుంచి (నవంబర్ 10) నుంచి పుష్ప షూటింగ్ మొదలుకాబోతోందన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్‌లో అల్లు అర్జున్‌తో పాటు పాల్గొనేందుకు రష్మిక ఉభయ గోదావరి జిల్లాలకు చేరుకునేందుకు వెళ్తోంది. అయితే షూటింగ్ కోసం బయల్దేరడమంటే తనకెంతో ఇష్టమని చెబుతూ ఓ క్యూట్ వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. పుష్ఫ చిత్రాన్ని మైత్రీ మూవీస్ నిర్మిస్తోండగా.. సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు.