రష్మిక మందన్నా ప్రస్తుతం బాలీవుడ్లో ఉన్న స్టార్ ఇమేజ్ను నిలబెట్టుకోవడానికి కీలక దశలో నిలిచింది. ‘పుష్ప’, ‘అనిమల్’, ‘ఛావా’ లాంటి భారీ విజయాల తర్వాత ఆమెకు ‘సికందర్’ రూపంలో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. సల్మాన్ ఖాన్‌తో చేసిన ఈ సినిమా కంటెంట్ పరంగా నిరాశపరిచింది. ఇందులో రష్మిక పాత్రకు ప్రత్యేకత లేకపోవడం, ట్రాక్ ఎక్కువగా రొటీన్‌గా ఉండటం విమర్శలకు దారితీసింది. ఫలితంగా, రష్మికపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెరిగింది.
ఇక ఆ పరాజయం వదిలేసి తిరిగి ట్రాక్‌లోకి రావాలంటే, దీపావళికి రిలీజ్ కానున్న ‘థామ’ సినిమా ఆమెకు ఛాన్స్‌గా మారింది. మాడాక్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ హారర్ కామెడీ చిత్రంలో రష్మిక ఆయుష్మాన్ ఖురానా జంటగా నటిస్తున్నారు. ఊటీలో షూటింగ్ జరుగుతోంది. గతంలో ‘స్త్రీ’, ‘బెడియా’, ‘ముంజ్యా’ లాంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్న మాడాక్ సంస్థ, ఇప్పుడు ‘థామ’పై కూడా అదే స్థాయిలో అంచనాలను పెంచుతోంది.
ముఖ్యంగా ‘స్త్రీ 2’ రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో ఈ జానర్‌పై ఆసక్తి పెరిగింది. రష్మిక పాత్రకు ఈ సినిమాలో మంచి ప్రాధాన్యం ఉందని సమాచారం. పక్కా కామెడీ టైమింగ్తోపాటు, హారర్ ట్రీట్మెంట్లో ఆమె కొత్త యాంగిల్ కనిపించబోతుందని చిత్రబృందం భావిస్తోంది. బాలీవుడ్ యువతలో కొత్తగా పాపులర్ అవ్వాలంటే, ‘థామ’ పర్ఫెక్ట్ ప్లాట్‌ఫామ్‌గా మారవచ్చు. దీపావళి రోజు (అక్టోబర్ 19) ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఫలితమే రష్మిక కెరీర్లో వచ్చే దశను నిర్ణయించనుంది.
ఈసారి హిట్ అయితే ‘సికందర్’ ఫెయిల్యూర్‌ను తిరిగి చక్కదిద్దుకునే అవకాశం రష్మికకు ఉంటుంది. కానీ ఇంకోసారి ఫ్లాప్ అయితే మాత్రం, బాలీవుడ్లో కొనసాగాలంటే కాంపిటేషన్ ఎక్కువగా మారనుంది. దాంతో ‘థామ’ ఎంతమేరకు వర్కౌట్ అవుతుందనేది ఆమె ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా చూస్తోంది.