దేవుడా… నేను దానికి బానిసైపోయాను.. రష్మిక మందాన్న రచ్చ వీడియో..!

Rashmika Mandanna Beach Workout video Goes Viral

ఛలో బ్యూటీ రష్మిక మందాన్న సోషల్ మీడియాలో చేసే రచ్చ అందరికీ తెలిసిందే. తెరపై ఎంత సందడిగా ఉంటుందో.. అంతకు వంద రెట్ల ఫన్‌ను సోషల్ మీడియాలో క్రియేట్ చేస్తుంది. అందుకే ఈ అమ్మడికి సోషల్ మీడియాలో అంతటి ఫాలోయింగ్. సినిమాలు హిట్ అవుతూ ఉండటం, స్టార్ హీరోయిన్‌గా తిరుగులేని స్టార్డం రావడంతో రష్మిక పాపులార్టీ రోజరోజుకీ పెరుగుతోంది. తాజాగా రష్మిక ఓ వీడియోను షేర్ చేసి రచ్చ రచ్చ చేస్తోంది.

Rashmika Mandanna Beach Workout video Goes Viral
Rashmika Mandanna Beach Workout video Goes Viral

సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లను కొట్టేసిన రష్మిక స్టార్ హీరోలకు పర్ఫెక్ట్ ఛాయిస్‌గా నిలుస్తోంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ప్యాన్ ఇండియన్ మూవీ పుష్పలో ఛాన్స్ కొట్టేసింది. అయితే రష్మిక ఈ మధ్య విపరీతమైన వర్కౌట్లు చేస్తోంది. అది కూడా తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ మాదిరి. బీచ్‌లో చెమటోడ్చుతున్న రష్మిక తన అనుభవాలను చెబుతూ ఓ వీడియోను షేర్ చేసింది.

బీచ్‌లో ఇదే నా ఫస్ట్ వర్కౌట్. మామూలుగా అయితే బీచ్‌లో ఇలా చేయడం ఇదే మొదటిసారి.. అమ్మో అక్కడ వర్కౌట్లు అంటే మొత్తం ఆవిరైపోయినట్టు అనిపించింది.. ఆ అలలు, సముద్రపు వాసన.. దేవుడా.. ఇవన్నీ అనుభవించాక వాటికి నేను బానిసనైపోయాను.. సూర్యాస్థమయం, నా పాదాలకంటున్న ఇసుక అవన్నీ ఎంతో అద్భుతంగా ఉన్నాయి అంటూ తెగ సంబరపడిపోయింది. ఈ వర్కౌట్లన్నీ పుష్ప సినిమా కోసమో ఏమో మరి.