మెగా కోడలు ఉపాసన కొణిదెల తన సోషల్ మీడయా ఖాతాల ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తుంటుంది. ప్రస్తుతం యువర్ లైఫ్ అనే వెబ్ సైట్,మ్యాగజైన్ ద్వారా ఆరోగ్యకరమైన జీవితం ఎలా గడపాలి, ఎలాంటి ఆహారాన్ని వండుకోవాలి.. సెలెబ్రిటీలు తమ ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తారు.. వారి ఆహార పద్దతులేంటన్నవి ప్రజల ముందుకు తీసుకొస్తోంది ఉపాసన. అందులో భాగంగా రష్మికతో ఉపాసన ఓ వీడియో చేసింది.
ఇందులో రష్మీ తమ సంప్రదాయ పద్దతులు, ఆచార వ్యవహారాలను చెప్పుకొచ్చింది. కొడిని కోర్గ్ భాషలో కోలి అని అంటారట. రష్మిక వండిన వంటకం పేరు కూడా ‘కోలీ పుట్టు’ కూర. కోడిని కోర్గిలో కోలి అంటారని రష్మిక అనగానే.. మీరు కోర్గి సామాజిక వర్గానికి చెందినవారా? మీరు పంది మాంసం ఎక్కువగా తింటారు కదా? అని ఉపాసన అడిగేసింది. దీనికి రష్మిక స్పందిస్తూ.. అవును, పంది మాంసం మా సంప్రదాయ వంటకమని నిర్మోహమాటంగా చెప్పేసింది
పందిని అలానే నిప్పులపై కాల్చి తింటామని రష్మిక పేర్కొంది. నిజానికి పంది మాంసం, వైన్‌తో మేం చాలా చేస్తామని అన్ని విషయాలను పూస గుచ్చినట్టు వివరించింది. తాం ఇంట్లోనే వైన్ తయారు చేస్తామని, ప్రతి కోర్గి ఇంట్లో పడుకునే ముందు రెండు కప్పులు లేదా రెండు పెగ్‌ల వైన్ తాగుతారని సీక్రెట్లను బయటకు చెప్పేసింది. దీని వల్ల నిద్ర బాగా పడుతుంది. అలాగే, గుండెకు కూడా చాలా మంచిదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.