రష్మిక మందాన్న సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. రష్మిక చేసే సందడి, అల్లరికి ఎంతో మంది అభిమానులున్నారు. రష్మికలోని క్యూట్ నెస్‌ను ఇష్టపడే వారు చాలా మందే ఉన్నారు. దానికి తగ్గట్టు రష్మిక షేర్ చేసే ఫోటోల్లో చిలిపిదనం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. తెరపై ఎంత అల్లరి చేస్తుందో సోషల్ మీడియాలోనూ అంతే అల్లరి చేస్తుంటుంది.
తాజాగా రష్మిక వార్తల్లో వైరల్ అయింది. తన మొదటి సినిమా కిరిక్ పార్టీలో ఓ పాట వంద మిలియన్లకు చేరుకోవడంతో తెగ సంబరపడిపోయింది. ఈ క్రమంలో తన మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టిని కూడా ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన రక్షిత్ ఆమెపై ఎవ్వరూ ఊహించని కామెంట్లు చేశాడు. నువ్ కన్న కలలన్నీ నిజం కావాలని కోరుకుంటున్నాను అని పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వడంతో అందరూ షాక్ అయ్యారు.
తాజాగా మరోసారి రష్మిక వార్తల్లో వైరల్ అయ్యేలా ఉంది. తనకు వేలికి ఉన్న ఉంగరాన్ని చూపి తాను ఇకపై ఒకరికి బంధీని అయిపోయాను అని చెప్పుకొచ్చింది. రష్మిక ఫ్రెండ్, స్టైలీష్ట్ శ్రావ్య వర్మ ఓ రింగ్‌ను తొడిగింది. ఆ ఉంగరాన్ని చూపిస్తూ రష్మిక ఓ పోస్ట్ చేసింది. ఇకపై నేను అధికారికంగా ఆమెకు లొంగిపోయాను అంటూ పోస్ట్ చేసింది రష్మిక. మొత్తానికి రష్మిక ఫన్నీ పోస్ట్‌కు నెటిజన్లు నవ్వుకుంటున్నారు.