ఒకప్పుడు తమకిష్ట హీరో, హీరోయిన్ల కోసం అభిమానులు ఎంతగా ఆరాటపడే వారో అందరికీ తెలిసిందే. బయట ఒక్క సారైనా వారిని చూడాలని, వారితో మాట్లాడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు. తమకిష్టమైన వారి కోసం లెటర్ల మీద లెటర్లు రాసే వారు. ఆ ఉత్తరాలు సదరు హీరో హీరోయిన్లు కూడా ఎంతో ప్రేమగా దాచుకునే వారు. రివర్స్‌లో ప్రత్యుత్తరాలు కూడా పంపేవారు. బొమ్మలను గీసి పంపేవారు కూడా.
కానీ ఇప్పుడు కాలం మారింది. తమ అభిమాన నటులతో నేరుగానే మాట్లాడుతున్నారు. రోజూ చూస్తున్నారు. సోషల్ మీడియా ఇంతలా విజృంభించడంతో దూరమనేది తగ్గిపోయింది. అభిమానులు తమ ప్రేమను చూపించేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందుకే తాజాగా రష్మిక మందాన్నకు ఓ అభిమాని అదిరిపోయే గిఫ్ట్‌ను పంపినట్టున్నాడు. అది చూసి రష్మిక దెబ్బకు ఫిదా అయిపోయినట్టుంది.
రష్మిక సోషల్ మీడియాలో ఎంత సరదాగా ఉంటుందో,ఎలాంటి పోజుల పెడుతూ చిన్న పిల్లలా అల్లరి చేస్తుందో అందరికీ తెలిసిందే. తాజాగా రష్మిక అభిమాని ఆమె బొమ్మను ఆర్ట్ వేసి పంపించాడు. దాన్ని చూసిన రష్మిక తెగ సంబరపడిపోయినట్టుంది. తనకు ఉత్తరం వచ్చిందని చెబుతూఅందులో ఇది ఉందని తన క్యూట్ ఆర్ట్‌ను చూపించింది. ఎంత ప్రేమ ఉంటే అంత మంచిగా ఆర్ట్ వేసి ఉంటారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.