ఆ విషయంలో చిన్న పిల్లవాడు.. బన్నీపై రష్మిక మందాన్న కామెంట్స్

Rashmika mandanna about Allu Arjun

రష్మిక మందాన్న ప్రస్తుతం పుష్ప షూటింగ్‌లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. సుకుమార్ కాంబోలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే చాలా రోజులకు రష్మిక సెట్‌లో అడుగుపెట్టింది. మారేడుమిల్లి, రంపచోడవరంలో జరిగిన షెడ్యూల్‌లొ రష్మిక ఆలస్యంగానే జాయిన్ అయింది. అయితే మొదటి సారిగా రష్మిక, బన్నీ కాంబోలో సీన్స్ ఈ షెడ్యూల్‌లోనే షూట్ చేశారని తెలుస్తోంది.

Rashmika mandanna about Allu Arjun
Rashmika mandanna about Allu Arjun

ఈ మేరకు రష్మిక మందాన్న మీడియాతో మాట్లాడుతు పుష్ప షూటింగ్, బన్నీతో పని చేసిన అనుభవం గురించి తాజాగా చెప్పుకొచ్చింది. ఇందులో భాగంగా రష్మిక మాట్లాడుతూ బన్నీ గురించి కామెంట్ చేసింది. అల్లు అర్జున్‌తో కలిసి పనిచేయడం స్పెషల్‌గా ఉంది. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. మంచి వ్యక్తి, మనసుపరంగా చిన్నపిల్లవాడు. ఆన్‌స్ర్కీన్‌లో మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఆయనతో కలిసి నటించడం సులభమే అంటూ చెప్పుకొచ్చింది.

మామూలుగా బన్నీ సెట్‌లో ఎంతో సరదాగా ఉంటాడని హీరోయిన్లు, దర్శకులు చెబుతుంటారు. బన్నీ వస్తే సెట్ అంతా ఎనర్జీతో నిండిపోతుందని ఏ ఒక్కరూ కూడా డల్‌గా కనిపించరని అంటుంటారు. తాజాగా రష్మిక మాటలను బట్టి చూస్తుంటే కూడా అదే అర్థమవుతోంది. అయితే రష్మిక చేసే అల్లరికి బన్నీ అల్లరి కూడా తోడైనట్టు కనిపిస్తోంది. మరి ఈ ఇద్దరి కెమిస్ట్రీని ప్రేక్షకులు ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి.