‘యానిమల్’‌లో రష్మిక అన్ని బౌండరీలూ దాటేసిందట.!

రష్మిక మండన్నా నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘యానిమల్’ ప్రతీరోజూ వార్తల్లో నిలుస్తోంది. సంచలనాత్మకమైన ప్రచారాలు వినిపిస్తున్నాయ్ ఈ సినిమాపై. ముఖ్యంగా రష్మిక నటించిన బోల్డ్ సన్నివేశాలే హాట్ టాపిక్ అవుతున్నాయ్.

ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల్లో రష్మిక, హీరో రణ్‌వీర్ కపూర్‌తో చేసిన లిప్‌లాక్ సన్నివేశాలకు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ ఎదుర్కొంటోంది రష్మిక మండన్నా.

ఇదిలా వుంటే, కేవలం ప్రోమోస్ పబ్లిసిటీనే కాదట. సినిమాలో అంతకు మించి గ్లామర్ వుండబోతోందట రష్మిక నుంచి.. అని తాజాగా ఇంకో ప్రచారం తెరపైకి వచ్చింది. అస్సలేమాత్రం మొహమాటపడకుండా.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఏం చెబితే అది చేసేసిందట రష్మిక మండన్నా.

చాలా వైల్డ్‌గా అంతకంటే ఎక్కువ బోల్డ్‌గా చిత్రీకరించాడట ఈ సినిమా సందీప్ రెడ్డి వంగా. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తెగ చక్కర్లు కొట్టేస్తోంది.

దాంతో, సినిమాకి సెన్సార్ కట్స్ చాలా తీవ్రంగా వుండొచ్చని అంటున్నారు. అయితే, సెన్సార్ కట్స్ వీలైనంత ఎక్కువ లేకుండా లాబీయింగ్స్ పనిలో బిజీగా వున్నారట ‘యానిమల్’ నిర్మాతల టీమ్.

ఇదిలా వుంటే, రష్మిక ఏమాత్రం వుండాల్సినంత గ్లామర్ వుంటుంది అంతే. కానీ, బోల్డ్ సన్నివేశాలు మాత్రం అన్ని పరిమితులకు లోబడే వుంటాయ్ అని చెబుతోంది. చూడాలి మరి, సినిమా రిలీజ్ అయితే కానీ ఈ ప్రచారాల సారాంశంలో నిజమెంతో తెలీదు.